IND vs ENG 2nd ODI : మొయిన్ అలీ (64 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లీ (49 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో భారత్ (India)తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ (England) ప్రత్యర్థి ముందు మెరుగైన టార్గెట్ ను ఉంచగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. యుజువేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించడంతో 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 117 పరుగులు చేసింది. చహల్ నాలుగు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రాలు చెరో రెండు వికెట్లు సొంతం చేసుకున్నారు. మొహమ్మద్ షమీ, ప్రసిధ్ తాలా ఓ వికెట్ తీశారు. లివింగ్ స్టోన్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగగా.. జేసన్ రాయ్ (23), జానీ బెయిర్ స్టో (38) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ అవుటయ్యాక జో రూట్ (11), బెన్ స్టోక్స్ (21), జాస్ బట్లర్ (4) వెంట వెంటనే అవుటయ్యారు. దాంతో ఇంగ్లండ్ 102 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. కాసేపటికే లివింగ్ స్టోన్ కూడా అవుటవ్వడంతో ఇంగ్లండ్ మరోసారి కష్టాల్లో పడింది. అయితే మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ జట్టును ఆదుకున్నారు. వీరు ఏడో వికెట్ కు 62 పరుగులు జోడించారు. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేసి వీరద్దరూ అవుటయ్యారు.
యుజీ స్పిన్ మాయ
యుజువేంద్ర చహల్ ఇంగ్లండ్ ను తిప్పేశాడు. తొలి వన్డేలో బుమ్రా, షమీలు ఇంగ్లండ్ పని పడితే.. ఈ మ్యాచ్ లో ఆ బాధ్యతను యుజువేంద్ర చహల్ తీసుకున్నాడు. ఇతడు తీసుకున్న నాలుగు వికెట్లు కూడా కీలకమైనవే కావడం విశేషం. జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీలను పెవిలియన్ కు పంపి ఇంగ్లండ్ పతనానికి బాటలు వేశాడు.
For his brilliant bowling figures of 4/47, @yuzi_chahal is our Top Performer from the first innings.
A look at his bowling summary here ????????#ENGvIND pic.twitter.com/97NkXBTTbv
— BCCI (@BCCI) July 14, 2022
తుది జట్లు
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా , సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్
ఇంగ్లండ్
జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, డేవిడ్ విల్లీ, ఓవర్టన్, కర్సే, రీస్ టొప్లే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shikhar Dhawan, Team India, Virat kohli