IND VS ENG 2021 THIRD TEST LIVE UPDATES INDIA HAVE WON THE TOSS AND OPTED TO BAT SRD
Ind Vs Eng : టాస్ గెలిచిన టీమిండియా.. కోహ్లీ నిర్ణయం ఇదే.. తుది జట్లు వివరాలు ఇలా..
Ind Vs Eng
Ind Vs Eng : లార్డ్స్ గ్రాండ్ విక్టరీ తర్వాత మరో సూపర్ ఫైట్ కు టీమిండియా (Team India) రెడీ అయింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ (England) ని ఢీ కొట్టడానికి సిద్ధమైంది కోహ్లీసేన.
లార్డ్స్ గ్రాండ్ విక్టరీ తర్వాత మరో సూపర్ ఫైట్ కు టీమిండియా (Team India) రెడీ అయింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ (England) ని ఢీ కొట్టడానికి సిద్ధమైంది కోహ్లీసేన. లార్డ్స్ విక్టరీ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో వెళ్లిన భారత్.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనుకుంటుంది. మరోవైపు అనవసర తప్పిదాలతో విజయం ముంగిట బోల్తా పడిన జోరూట్ సేన.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఇప్పటికే తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడిన ఆతిథ్య జట్టు.. తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా సిద్దమవుతోంది. లీడ్స్‌లో లెక్కసరి చేసి లార్డ్స్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది కోహ్లీసేన. రెండో టెస్ట్ లో బరిలోకి దిగినా టీమ్ తోనే టీమిండియా ఈ మ్యాచ్ లో ఆడుతోంది. ఇక, ఇంగ్లండ్ టీమ్ భారీగా మార్పులు చేసింది.
India (Playing XI): రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
England (Playing XI): రోరి బర్న్స్ , హాసీబ్ హామీద్, డేవిడ్ మలన్, జో రూట్(c), జానీ బెయిర్ స్టో, జాస్ బట్లర్(w), మొయిన్ అలీ , సామ్ కర్రన్, క్రెగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్
🏏 INDIA WIN TOSS & BAT 🏏
📰 𝑻𝒆𝒂𝒎 𝑵𝒆𝒘𝒔 ⤵
🏴 Two changes - Malan and Overton in for Sibley, Wood
🇮🇳 India unchanged after Lord's winpic.twitter.com/vLYWQF5sXM
ఇక, రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కోహ్లీసేన నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పేస్ బౌలింగ్ త్రయం జస్ప్రీత్ బుమ్రా-మహ్మద్ షమీ-ఇషాంత్ శర్మ విజృంభణ ముందు నిలవలేకపోయింది. అలవోకగా తల వంచింది. నిర్ణయాత్మకమైన రెండో ఇన్నింగ్‌లో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో భారత్ చేతిలో 151 పరుగుల తేడాతో మట్టి కరిచింది. మూడో టెస్ట్‌లో ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే కసిని రగిలింపజేసింది. ఇక, ఇప్పటికే ఐదు టెస్ట్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.