Ind Vs Eng : మూడో టెస్ట్ కి భారత తుది జట్టు ఇదే..! అశ్విన్ కు అవకాశం.. ఆ ప్లేయర్ పై వేటు పడే ఛాన్స్..

మూడో టెస్ట్ కి భారత తుది జట్టు ఇదే..! అశ్విన్ కు అవకాశం..

Ind Vs Eng : లార్డ్స్ గ్రాండ్ విక్టరీతో మరో సూపర్ ఫైట్ కు టీమిండియా రెడీ అయింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ ని ఢీ కొట్టడానికి సిద్ధమైంది కోహ్లీసేన. లార్డ్స్ విక్టరీ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో వెళ్లిన భారత్.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనుకుంటుంది.

 • Share this:
  లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు (Team India) చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అసలు చివరి రోజు టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మహా అయితే డ్రా చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లీ సేన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకుంది. ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. ఈ గ్రాండ్ విక్టరీతో మరో సూపర్ ఫైట్ కు టీమిండియా  రెడీ అయింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ ని ఢీ కొట్టడానికి సిద్ధమైంది కోహ్లీసేన. లార్డ్స్ విక్టరీ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో వెళ్లిన భారత్.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనుకుంటుంది. మరోవైపు అనవసర తప్పిదాలతో విజయం ముంగిట బోల్తా పడిన జోరూట్ సేన.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఇప్పటికే తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడిన ఆతిథ్య జట్టు.. తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా సిద్దమవుతోంది. లీడ్స్‌లో లెక్కసరి చేసి లార్డ్స్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో మూడో టెస్ట్ సైతం అభిమానులకు కావాల్సిన మాజా అందించనుంది. ఇక విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టులో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

  తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి రానున్నాడు. వాస్తవానికి అశ్విన్‌ను పక్కనపెట్టి జడేజాను తీసుకోవడమే భారత క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కాకపోతే వాతావరణ పరిస్థితులు, జడేజా బ్యాటింగ్ సామర్థ్యం అశ్విన్‌ను పక్కనపెట్టేలా చేశాయి. భారత మిడిలార్డ్ బ్యాటింగ్ బలహీనత, లండన్, నాటింగ్‌హామ్ వాతావరణ పరిస్థితులతో జడేజాను జట్టులోకి తీసుకోకతప్పలేదు. నలుగురు పేసర్లు ఏకైక స్పిన్నర్‌ రూల్‌తో బరిలోకి దిగడంతో తుది జట్టులో అశ్విన్‌కు చోటు లేకుండా పోయింది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించిన జడేజా బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. టీమిండియా పేసర్లు వికెట్లు తీయడంతో పాటు విజయం దక్కడంతో జడేజా బౌలింగ్ వైఫల్యం పెద్దగా కనిపించలేదు. కానీ పేసర్లే రాణించకుంటే భారత పరిస్థితి దారుణంగా ఉండేది.

  తొలి టెస్ట్‌లో 16 ఓవర్లు వేసిన జడేజా ఒక్క వికెట్ తీయకపోగా.. ఓవర్‌కు 3.30 చోప్పున పరుగులిచ్చి ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జడేజా బౌలింగ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. ఇక రెండో టెస్ట్‌లో 28 ఓవర్లు వేసిన జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు. 48 పరుగులిచ్చాడు. అంతేకాకుండా తరుచు ఫుల్ లెంగ్త్ బాల్స్, హాఫ్ వ్యాలీలు వేస్తూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పని సులువు చేశాడు. మరోవైపు అశ్విన్ సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగు కీలక వికెట్లు తీసిన అతను.. కౌంటీ క్రికెట్‌లో సర్రే టీమ్ తరఫున 6/27 వికెట్లతో చెలరేగాడు.

  ఒకవేళ 4+1 (నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్) ఫార్మూలాకు కట్టుబడితే మాత్రం జడేజా స్థానంలో అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చు. ఇషాంత్ శర్మ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. అయితే శార్దూల్ తొడకండరాల గాయం నయమైతే ఈ మార్పు జరగనుంది. అలా కాకుండా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే మాత్రం ఇషాంత్ శర్మ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మరోవైపు మ్యాచ్ జరిగే లీడ్స్ ఎండలు బాగా కాసే ఉంది. దీంతో పొడి వాతావరణం స్పిన్నర్లకు సహకరిస్తోంది. స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్‌ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.

  భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ/రవీంద్ర జడేజా(వాతావరణం బట్టి)
  Published by:Sridhar Reddy
  First published: