IND VS ENG 2021 TEAM INDIA INDEPENDENCE DAY CELEBRATIONS IN LONDON AND DEEPTI SHARMA RUNG THE BELL AT LORDS GROUND SRD
Ind Vs Eng 2021 : లండన్ లో టీమిండియా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. దీప్తి శర్మకు దక్కిన అరుదైన గౌరవం..
భారత జాతీయ పతాకం
Ind Vs Eng 2021 : ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం కారణంగా మనం అందరం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం.
ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం కారణంగా మనం అందరం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక, దేశవ్యాప్తంగా దేశ ప్రజలంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ మాతాకీ జై అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు. భారత దేశ ఔనత్యాన్ని గుర్తు చేస్తున్నారు. లాల్ ఖిల్లా వేదికగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే . ఇక, ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో ఉన్న టీమిండియా... లండన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయుల రాజధాని లండన్ నగరంలో భారత జెండా రెపరెపలాడింది. ఇంగ్లాండ్ టూర్లో ఉన్న భారత క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు, సహాయక సిబ్బందితో పాటు టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
టీమిండియా కెప్టెన్ కోహ్లీ జెండాను ఎగురవేయగా... కోచ్ రవిశాస్త్రి, విరాట్‌తో పాటు జెండా అధిరోహణకు వచ్చాడు. లండన్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ. మరోవైపు, భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం కల్పించింది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ యాజమాన్యం. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటను గంట మోగించి ఆరంభించింది దీప్తి శర్మ.
ఇక, లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా, ఇంగ్లండ్ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయ్. ఇక, మ్యాచ్ లో రెండో టెస్టులో కెప్టెన్ జో రూట్ (Joe Root) మూడో రోజు చెలరేగిపోయాడు. రోజంతా క్రీజులో పాతుకొని పోయిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ (180 నాటౌట్) ఇంగ్లాండ్ జట్టుకు స్వల్ప ఆధిక్యాన్ని అందించాడు. డబుల్ సెంచరీకి చేరువైనా.. ఇంగ్లాండ్ లోయర్ మిడిల్, టెయిలెండర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ జట్టు 391 పరుగులకు ఆలౌట్ అయ్యి తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. మరోవైపు, నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.