Home /News /sports /

IND VS ENG 2021 TEAM INDIA FORMER CRICKETER SUNIL GAVASKAR CONCERNS ABOUT TEAM INDIA COLLAPSE IN LEEDS TEST SRD

Ind Vs Eng : " పట్టుమని గంట ఆడలేకపోయారు.. బ్యాటింగ్ పిచ్ పై ఇలాంటి చెత్త ఆటా..? "

Team India

Team India

Ind Vs Eng : ఓ వైపు ప్రత్యర్థి టీమ్ అదే పిచ్ పై 400 కు పైగా పరుగులు చేసింది. కానీ మన టీమిండియా (Team India) రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా ఆ స్కోరును దాటలేకపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే.. గల్లీ ప్లేయర్ల కన్నా దారుణంగా ఆడారు. అర్జెంట్ గా ఏదో పని ఉన్నంటూ ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు.

ఇంకా చదవండి ...
  ఓ వైపు ప్రత్యర్థి టీమ్ అదే పిచ్ పై 400 కు పైగా పరుగులు చేసింది. కానీ మన టీమిండియా (Team India) రెండు ఇన్నింగ్స్ ల్లో కూడా ఆ స్కోరును దాటలేకపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే.. గల్లీ ప్లేయర్ల కన్నా దారుణంగా ఆడారు. అర్జెంట్ గా ఏదో పని ఉన్నంటూ ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టారు. మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. కోహ్లీ (Virat Kohli) నుంచి సిరాజ్ (Mohammed Siraj) వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో అర్దం చేసుకోవచ్చు. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో కోహ్లీసేన చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ ఘోరపరాజయాన్ని మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో లెజెండ్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) చేరారు. తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత టీమిండియా ఓడుతుందని ఊహించారు అందరూ, కానీ మూడో రోజు ఆట తర్వాత ఇన్నింగ్స్ తేడాతో ఓటమి మాత్రం ఉండదని భావించారు.

  అయితే ఛతేశ్వర్ పూజారా వికెట్ పడిన తర్వాత వికెట్ల పతనానికి గేట్లు ఎత్తేసినట్టయ్యింది. అప్పటిదాకా క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీ నుంచి రహానే, పంత్, మహ్మద్ షమీ... ఇలా 63 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. " లార్డ్స్‌లో టీమిండియా అద్వితీయ ఆటను చూపించింది. ఆ ఆటను చూసిన తర్వాత ఇంగ్లాండ్, ఈ సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమేనని అనుకున్నాను... అయితే మూడో టెస్టులో సీన్ రివర్స్ అయ్యింది. మొదటి మూడు వికెట్లు పడితే చాలు, మిగిలిన వికెట్లు తీయడానికి పెద్ద సమయమేమీ పట్టదని అందరికీ అర్థమైపోయింది. 54 నిమిషాల వ్యవధిలో ఏడు వికెట్లు పడ్డాయి.ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాను ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. బ్యాటింగ్‌కి సహకరిస్తున్న పిచ్‌పై ఇలా కుప్పకూలడం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం... " అంటూ కామెంట్ చేశాడు సన్నీ. ఇక, కీలకమైన నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరగనుంది.

  virat kohli news, sunil gavaskar on kohli, sunil gavaskar bcci selection committee, bcci news, ind wi tour 2019, india west indies tour, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, భారత్ వెస్టిండీస్ టూర్
  సునీల్ గవాస్కర్(ఫైల్ ఫోటో)


  మరోవైపు, మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి నాలుగో టెస్ట్ లో టీమిండియాలో సమూల మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. దీంతో నాలుగో టెస్ట్ లో ఎవరిపై వేటు పడనుందో అర్ధం కావటం లేదు. కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా తీసుకుని.. పృథ్వీషా తో ఓపెనింగ్ చేయించే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక, నాలుగో టెస్ట్ లో అశ్విన్ ను కచ్చితంగా తుది జట్టులో చూడొచ్చు. ఎందుకంటే టీమిండియాపై వీరవీహారం చేస్తోన్న జో రూట్ ను కట్టడి చేయాలంటే అశ్విన్ తుది జట్టులో ఉండటం తప్పనిసరి అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్ లకు జట్టులో చోటు దక్కే ఛాన్సులు ఉన్నాయని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cheteswar Pujara, Cricket, India vs england, Rohit sharma, Sunil Gavaskar, Team india, Virat kohli

  తదుపరి వార్తలు