శ్రీ రెడ్డి (Sri Reddy) ఏం మాట్లాడినా, ఏదైనా పోస్ట్ చేసినా కూడా అది ఓ సెన్సేషన్ అవుతుంది. తన పర్సనల్ విషయాల దగ్గరి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ట్రెండింగ్ వరకు ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక, లేటెస్ట్ గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. మూడో టెస్టులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. కోహ్లీ (Virat Kohli) నుంచి సిరాజ్ (Mohammed Siraj) వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో అర్దం చేసుకోవచ్చు. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో కోహ్లీసేన చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ ఘోరపరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అసమర్థత వల్లనే ఈ ఘోర పరాజయం ఎదురైందని కామెంట్ చేస్తున్నారు. ఇక, ఈ లిస్ట్ లో శ్రీ రెడ్డి కూడా చేరింది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)ను నియమించాలని, సారథిగా విరాట్ కోహ్లీ పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమ చెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్ చేసింది. అంతేకాకుండా కోహ్లీ చెత్త పరమ చెత్త ఆటగాడు అంటూ తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది.
ఇక శ్రీరెడ్డి అభిప్రాయాన్ని విభేదిస్తూ కోహ్లీ అభిమానులకు రంగంలో దిగగా.. వారికి కూడా ఆమె ధీటుగా బదులిచ్చింది. లార్డ్స్ టెస్ట్ విజయంలో కోహ్లీ పాత్ర లేదా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఏం లేదని, ఇతరుల క్రెడిట్ కోహ్లీ తీసుకున్నాడని చెప్పింది. ఇక శ్రీరెడ్డి అభిప్రాయంతో రోహిత్ శర్మ అభిమానులు ఏకీభవిస్తున్నారు. హిట్‌మ్యాన్‌కు సారథ్య బాథ్యతలు ఇవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
కోహ్లీ అభిమానులు మాత్రం శ్రీరెడ్డిపై ఫైరవుతున్నారు. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసని ప్రశ్నిస్తున్నారు. సినీ, రాజకీయాల జోలికి వెళ్లే శ్రీరెడ్డి ఇప్పుడు తన దృష్టిని క్రికెట్ మీద మరల్చిందేందబ్బా? అని సాధారణ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఇక, కీలకమైన నాలుగో టెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు ఓవల్ వేదికగా జరగనుంది.
Kohli The Worst, The Worst Batting, Worst Performance Ever ??? Its Time to Kohli Retirement from Test Cricket ? Kohli The Worst, Worst, Worst ?#Kohli #INDvENG
— Sri Reddy (@MsSriReddy) August 28, 2021
aa Win lo kohli Role Zero ?
— Sri Reddy (@MsSriReddy) August 28, 2021
ఓవర్‌నైట్ స్కోరు 215/2తో నాలుగో రోజు శనివారం ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాబిన్సన్ (5/65), ఓవర్టన్ (3/47) భారత్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. చేతిలో 8 వికెట్లున్న భారత్ నాలుగో రోజు ఉదయం సెషన్‌లో ఇరవై ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 63 పరుగులు జతచేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది.
మరోవైపు, మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి నాలుగో టెస్ట్ లో టీమిండియాలో సమూల మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. దీంతో నాలుగో టెస్ట్ లో ఎవరిపై వేటు పడనుందో అర్ధం కావటం లేదు. కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా తీసుకుని.. పృథ్వీషా తో ఓపెనింగ్ చేయించే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక, నాలుగో టెస్ట్ లో అశ్విన్ ను కచ్చితంగా తుది జట్టులో చూడొచ్చు. ఎందుకంటే టీమిండియాపై వీరవీహారం చేస్తోన్న జో రూట్ ను కట్టడి చేయాలంటే అశ్విన్ తుది జట్టులో ఉండటం తప్పనిసరి అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్ లకు జట్టులో చోటు దక్కే ఛాన్సులు ఉన్నాయని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Rohit sharma, Sri Reddy, Tollywood news, Virat kohli