హోమ్ /వార్తలు /క్రీడలు /

KTR On Test Cricket : టెస్ట్ క్రికెట్, రోహిత్ శర్మ ప్రదర్శనపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

KTR On Test Cricket : టెస్ట్ క్రికెట్, రోహిత్ శర్మ ప్రదర్శనపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR On Test Cricket : క్రికెట్ (Cricket) ను భారత్ లో ఒక మతంలా భావిస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ధనాధన్ గేమ్ ను ఆస్వాదిస్తారు. క్రికెట్‌ను అభిమానించని వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

ఇంకా చదవండి ...

  క్రికెట్ (Cricket) ను భారత్ లో ఒక మతంలా భావిస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ధనాధన్ గేమ్ ను ఆస్వాదిస్తారు. క్రికెట్‌ను అభిమానించని వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇండియన్స్‌ క్రికెట్‌ను అంతలా ఓన్‌ చేసుకుంటారు. దీనికి సామాన్యులను సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. తమ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో ఎంత బిజీగా ఉన్నా క్రికెట్‌కు సమయం కేటాయిస్తుంటారు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వారు కూడా క్రికెట్‌ను ఫాలో అవుతుంటారు. ఎప్పుడూ పర్యటనలు, ప్రారంభోత్సవాలు, సమావేశాలతో రాజకీయ ప్రజా ప్రతినిధులు బిజీ బిజీగా ఉంటారు. కాస్త సమయం దొరికితే.. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. కొందరు అయితే తమకు నచ్చిన పనిలో బిజీగా అయితపోతారు. అయితే రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ (Minister KTR) తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈసారి అయినా పాలిటిక్స్ జోలికి పోకుండా క్రికెట్ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  లేటెస్ట్ గా ఇండియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌పై కూడా కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు." టెస్ట్‌ క్రికెట్‌ ఫార్మట్‌లో ఏదో తెలియని మాయ ఉంది. ఈ మ్యాచ్‌ల్లో ఉండే మజానే వేరు. బాల్‌ బాగా స్వింగ్‌ అయ్యే మైదానాల్లో టెస్ట్‌ క్రికెట్‌ ఆడితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ అండర్సన్‌ స్వింగ్‌ బౌలింగ్‌ను కోహ్లీ ఎదుర్కొన్న తీరు అద్భుతం. రోహిత్‌ శర్మ కూడా ఈ మ్యాచ్‌ లో అద్భుతంగా ఆడాడు" అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

  ఇక పోతే... లార్డ్స్‌ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిపత్యం కోసం రెండు జట్లు పోరాడుతున్నాయి. నువ్వానేనా అన్నట్టు ఆడుతున్నాయి. 400+ స్కోరు చేస్తుందని భావించిన టీమ్‌ఇండియా 364కే పరిమితమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ఆరంభించిన కోహ్లీసేన వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది ఇంగ్లీష్ టీమ్. అయితే, మూడో రోజు ఆటను దూకుడుగా ఆరంభించింది ఇంగ్లండ్ టీమ్. వరుస బౌండరీలతో ఇంగ్లండ్ స్కోరు పరుగులు పెట్టిస్తున్నారు జో రూట్, జానీ బెయిర్ స్టో.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs england, Kohli, KTR, Rohit sharma, Sports, Test Cricket

  ఉత్తమ కథలు