హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Eng : ఐదేళ్ల తర్వాత జట్టులో చోటు సంపాందించుకున్నాడు... చివరికి గోల్డెన్ డక్ అయ్యాడు..

Ind Vs Eng : ఐదేళ్ల తర్వాత జట్టులో చోటు సంపాందించుకున్నాడు... చివరికి గోల్డెన్ డక్ అయ్యాడు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ind Vs Eng : లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు సాధించే దిశగా అడుగులేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు సాధించే దిశగా అడుగులేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (48 నాటౌట్‌; 75 బంతుల్లో 6x4), జానీ బెయిర్‌స్టో (6 నాటౌట్‌; 17 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. సిబ్లీ (11), హమీద్‌ (0) నిరాశపర్చగా.. రోరీ బర్న్స్‌ (49; 136 బంతుల్లో 7x4) ఆకట్టుకున్నాడు. భారత పేసర్ మొహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్‌కు 245 పరుగులు వెనకబడి ఉంది. ఇక, టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు సంగతి తెలిసిందే. వరుస బంతుల్లో వికెట్లు తీసాడు. హైదరాబాద్ గల్లీ బాయ్ మ్యాజిక్‌కు ఐదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన హసీబ్ హమీద్(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు ఇంగ్లండ్ ఓపెనర్ డొమినిక్ సిబ్లే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. వరుస బంతుల్లో వికెట్లు తీసిన సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం ఈ వికెట్లకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మియా బాయ్ అదరగొట్టాడని అభిమానులు కొనియాడుతున్నారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను రోరీ బర్న్స్‌ డామ్‌ సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. టీ సమయానికి 14 ఓవర్లలో 23 పరుగులు జత చేశారు. అయితే విరామం తర్వాత హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో వరుస బంతుల్లో డొమినిక్ సిబ్లే(44 బంతుల్లో ఫోర్‌తో 11), హసీబ్ హమీద్(0)‌లను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్‌లో రెండో బంతిని సిరాజ్ లెగ్‌ స్టంప్‌ లైన్‌ దిశగా వేయగా.. సిబ్లే దాన్ని ప్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా షార్ట్ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్నకేఎల్ రాహుల్ చేతుల్లో పడింది.

ఆ తర్వాత క్రీజులోకి హమీద్ రాగా.. ఆఫ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని మహమ్మద్ సిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీని హమీద్ ఫార్వార్డ్ డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఐదేళ్ల తర్వాత టెస్టులు ఆడుతుండటంతో అతను బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో.. బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వెళ్లి స్టంప్‌లను గీరాటేసింది. దీంతో ఐదేళ్ల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడిన హమీద్.. సిరాజ్ దెబ్బకి గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. 2016 నవంబర్‌లో తన చివరి టెస్టు ఆడిన హమీద్‌... 1717 రోజుల తర్వాత మళ్లీ ఇంగ్లండ్‌ జట్టులో స్థానం సంపాదించి తొలి బంతికే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్‌ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్‌ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. ముఖ్యంగా సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.

First published:

Tags: Cricket, India vs england, Mohammed Siraj, Sports, Virat kohli

ఉత్తమ కథలు