IND VS ENG 2021 NICK COMPTON TWEET ON VIRAT KOHLI GOES VIRAL AND TEAM INDIA CAPTAIN FANS BACKLASH ENGLAND FORMER CRICKETER SRD
Ind Vs Eng : " సచిన్ ఎంత హుందాగా ఉంటాడో చూసి నేర్చుకో కోహ్లీ " .. ఆగని మాటల యుద్ధం..
Ind Vs Eng
Ind Vs Eng : లార్డ్స్ టెస్ట్ ముగిసి నాలుగు రోజులైనా.. ఇరు జట్ల మధ్య వేడి చల్లారడం లేదు. ముఖ్యంగా కోహ్లీ (Virat Kohli)ని టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ జట్టు మాజీ ఆటగాళ్లు తమ నోళ్లకు పని చెబుతున్నారు.
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత జట్టు (Team India) చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అసలు చివరి రోజు టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మహా అయితే డ్రా చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లీ సేన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకుంది. ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. లార్డ్స్ టెస్ట్ ముగిసి నాలుగు రోజులైనా.. ఇరు జట్ల మధ్య వేడి చల్లారడం లేదు. ముఖ్యంగా కోహ్లీ (Virat Kohli)ని టార్గెట్ చేస్తూ ఇంగ్లండ్ జట్టు మాజీ ఆటగాళ్లు తమ నోళ్లకు పని చెబుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు స్వభావం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాధ వచ్చినా.. సంతోషం కలిగినా కోహ్లిని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక, లేటెస్ట్ గా లార్డ్స్ టెస్టు విజయం తర్వాత కోహ్లి చేసిన సంబరాలు సోషల్ మీడియాలోనూ హల్చల్ అయ్యాయి. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నిక్ కాంప్టన్ కోహ్లిని తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు అతని మెడకే చుట్టుకునేలా చేశాయి. ''కోహ్లి నోరు తెరిస్తే బూతులే వస్తాయంటూ'' ట్విటర్ వేదికగా కాంప్టన్ తెలిపాడు.
నిక్ కాంప్టన్ ట్వీట్..
చెత్తమాటలు మాట్లాడటంలో.. కోహ్లీ నెంబర్ వన్ అంటూ కాంప్టన్ పేర్కొన్నాడు. ''కోహ్లి నోరు తెరిస్తే అతని నోటి నుంచి బూతులే ఎక్కువగా వస్తాయి. 2012లో కోహ్లి నన్ను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను నేను మర్చిపోలేదు. ఆ సమయంలో కోహ్లి అలా చేసి తనను తాను తక్కువ చేసుకున్నాడు. కోహ్లి చర్యలతో పోలిస్తే.. జో రూట్, సచిన్ టెండూల్కర్, కేన్ విలియమ్సన్ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోంది" అంటూ నిక్ కాంప్టన్ ట్వీట్ చేశాడు.
Where were you when -
Anderson Insulted Ashwin
Buttler insulted Philander in his farewell match.
అయితే, కాంప్టన్ వ్యాఖ్యలపై కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో దెబ్బకు ట్వీట్‌ను తొలగించాల్సి వచ్చింది. ''నిక్ కాంప్టన్.. నీకు సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి.. అండర్సన్ అశ్విన్‌ను అవమానించినప్పుడు.. అలాగే వీడ్కోలు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫిలాండర్‌ను బట్లర్ దూషించినప్పుడు నువ్వెక్కడున్నావు..'' అంటూ కామెంట్స్ చేశారు.
He's only sharing some contributions of Nick that are negligible for his nation,. Phil is only disappointed that he got distracted by hearing that information 🤣
అలాగే, '' లార్డ్స్ టెస్టులో బుమ్రా ఒక ఓవర్ అండర్సన్‌కు ప్రమాదకరంగా వేసిన మాట నిజమే.. కానీ అది మనసులో పెట్టుకొని బుమ్రా బ్యాటింగ్ దిగినప్పుడు అతన్ని టార్గెట్ చేయడం కరెక్టేనా..''.. '' బుమ్రాతో మీరు ప్రవర్తించిన తీరుపై మీ జట్టు మాజీ ఆటగాళ్లతో పాటు షేన్ వార్న్ లాంటి వారు కూడా తప్పుబట్టారు. కోహ్లి మ్యాచ్ గెలిచామన్న సంతోషంలో అలా చేశాడే తప్ప అతని మనుసులో ఏం లేదు.. అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైరయ్యారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.