ఇంగ్లాండ్-ఇండియా (India Vs England) టెస్ట్ మ్యాచ్‌లలో హల్ చల్ చేస్తున్న జెర్సీ నెంబర్ 69 (Jarvo 69) జార్వో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. రెండో టెస్టులో టీమ్ ఇండియా జెర్సీ వేసుకొని ఫీల్డింగ్ సెట్ చేసిన జార్వో.. మూడో టెస్ట్ లో సెక్యూరిటీ కళ్లుగప్పి ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు వచ్చాడు. రోహిత్ శర్మ (Rohit Sharma) అవుటైన వెంటనే వికెట్ల దాకా వెళ్లిన జర్వోను సెక్యూరిటీ బలవంతంగా అక్కడి నుంచి పంపించేసింది. ఇప్పుడు నాలుగో టెస్ట్ లో కూడా సడన్ ఎంట్రీ ఇచ్చి నవ్వులు పూయిస్తున్నాడు జార్వో. ఇక ఈ రోజు ఓవల్ మైదానంలో ఉమేష్ బౌలింగ్ చేస్తున్న సమయంలో రయ్యిమంటూ బౌలింగ్ చేసుకుంటూ ఉరికి వచ్చి బెయిర్ స్టోని గుద్దాడు. వెంటనే సెక్యూరిటీ వాళ్లు అతన్ని ఈడ్చుకొని వెళ్లారు.పదే పదే ఆయన ఇలా చేస్తుండడం అందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఫ్రాంక్ స్టార్‌గా మంచి గుర్తింపు ఉన్న జార్వో అసలు పేరు డేనియల్ జార్విస్. బీఎండబ్ల్యూ జార్వో పేరుతో జార్వో నడుపుతున్న యూ ట్యూబ్‌చానెల్‌కు లక్ష మంది సబ్‌స్క్రైబర్స్ ఉండడం విశేషం. వృత్తి పరంగా కమెడియన్, ఫిల్మ్ మేకర్, ఫ్రాంక్‌స్టార్‌గా రాణిస్తున్నాడు.
ఇక, ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ అభిమాని జార్వో ఎవరికి రానంత పేరు సంపాదించాడు. ఒకే టెస్టు సిరీస్‌లో సెక్యూరిటీని దాటుకొని రెండుసార్లు మైదానంలోకి వచ్చిన జార్వో సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయిడు.
జార్వో వ్యవహరించిన తీరు తప్పుగా ఉన్నప్పటికీ అంత సెక్యురిటీని దాటుకొని మైదానంలోకి దూసుకురావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక వరుసగా లార్డ్స్, లీడ్స్ టెస్టుల్లో తన ఎంట్రీతో ఆటకు అంతరాయం కలిగించిన జార్వోపై హెడ్డింగే స్టేడియం నిర్వాహకులు జీవితకాలం నిషేధం విధించారు.
Jarvo again!!! Wants to bowl this time ??#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021
సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో జార్వో ఎంట్రీ, మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త వినోదాన్ని పంచింది. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్తుంటే, జార్వో వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం, అందరికీ నవ్వులు పూయిస్తోంది.
JARVO 69 IS BACK AND READY TO BAT.
????????? pic.twitter.com/OLr3r0P0SQ
— Cricket Mate. (@CricketMate_) August 27, 2021
Disgusting treatment of India’s star player. @BMWjarvo Jarvo is a fan favourite. pic.twitter.com/xOhKTBYSnI
— Max Booth (@MaxBooth123) August 27, 2021
అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓ అభిమాని, ఇలా రెండు సార్లు క్రీజులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే అభిమాని, రెండుసార్లు సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చాడంటే, మరేవరైనా వస్తే ప్లేయర్ల రక్షణకి గ్యారెంటీ ఏంటని నిలదీస్తున్నారు అభిమానులు.
అయితే, జార్వో ఇలాంటి పనులు చేయడం కొత్త కాదట. ఇంతకు ముందు కూడా మనోడి ఇలాంటివి చాలానే చేశాడు. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు.
ఇది కూడా చదవండి : వావ్.. ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసుండరు.. ఈ వీడియో గుండెలకు హత్తుకోవడం ఖాయం..
ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్‌లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Mohammed Siraj, Viral Video, Viral Videos, Virat kohli