హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : వీడెవడండీ బాబూ..! ఈ సారి ప్యాడ్లు కట్టుకుని కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు..!

Viral Video : వీడెవడండీ బాబూ..! ఈ సారి ప్యాడ్లు కట్టుకుని కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో జార్వో ఎంట్రీ, మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త వినోదాన్ని పంచింది. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్తుంటే, జార్వో వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం, అందరికీ నవ్వులు పూయిస్తోంది.

ఇంకా చదవండి ...

ఇంగ్లండ్‌ (England) తో రెండో టెస్టు మూడో రోజు లంచ్‌ విరామం ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో (Lords Pitch Invader Jarvo) అనే ఒక అభిమాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. మొదట జార్వోని గుర్తుపట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత తేరుకున్న భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని తీసుకెళ్లారు. భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయింది. ఇక, ఆ ఘటన మర్చిపోకముందే.. మూడో టెస్టులో క్రీజులో ప్రత్యేక్షమయ్యాడు జార్వో. రోహిత్ శర్మ (Rohit Sharma) అవుటైన తర్వాత భారత జెర్సీలో ప్యాడ్స్, బ్యాటు పట్టుకుని నెం.4 బ్యాట్స్‌మెన్‌లా క్రీజులోకి వచ్చేశాడు జార్వో. అతను బ్యాటింగ్‌కి సిద్ధమవుతున్న సమయంలో క్రీజులోకి వచ్చింది విరాట్ కోహ్లీ (Virat Kohli) కాదని ఆలస్యంగా గుర్తించిన సెక్యూరిటీ అధికారులు, అతన్ని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు.

సీరియస్‌గా సాగుతున్న మ్యాచ్‌లో జార్వో ఎంట్రీ, మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి కాస్త వినోదాన్ని పంచింది. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్తుంటే, జార్వో వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం, అందరికీ నవ్వులు పూయిస్తోంది.అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఓ అభిమాని, ఇలా రెండు సార్లు క్రీజులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే అభిమాని, రెండుసార్లు సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చాడంటే, మరేవరైనా వస్తే ప్లేయర్ల రక్షణకి గ్యారెంటీ ఏంటని నిలదీస్తున్నారు అభిమానులు.

' isDesktop="true" id="1011820" youtubeid="BeAmS6ZjXY8" category="sports">

అయితే, జార్వో ఇలాంటి పనులు చేయడం కొత్త కాదట. ఇంతకు ముందు కూడా మనోడి ఇలాంటివి చాలానే చేశాడు. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్‌ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్‌ చేసి మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్‌లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్‌ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది.

First published:

Tags: Cricket, India vs england, Rohit sharma, Viral Video, Virat kohli

ఉత్తమ కథలు