ఫస్ట్ టెస్ట్‌లో విజయాన్ని తృటిలో చేజార్చుకొని.. రెండో టెస్ట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఇంగ్లండ్ (England) గడ్డపై జోరు కనబర్చిన కోహ్లీ సేన (Team India Updates).. మూడో మ్యాచ్ లో చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్ల ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ దారుణ ఓటమికి కారణమయ్యారు. ఇక, నాలుగో టెస్ట్ లో సేమ్ సీన్ రీపీట్. మరోసారి ఆఫ్ స్టంప్ బంతులకి వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ (Rohit Sharma), పుజారా, కోహ్లీ (Virat Kohli), జడేజా, రహానే ఆఫ్ స్టంప్ బంతులకే ఔటయ్యారు. అయితే, చివర్లో శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur Innings) మెరుపులతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆఖర్లో బౌలర్ల జోరుతో ఈ మ్యాచ్ లో రేస్ లో నిలిచింది కోహ్లీసేన. అయితే, ఈ మ్యాచ్ లో కోహ్లీ నిర్ణయం టీమిండియా ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీసులో వరుసగా నాలుగో మ్యాచులోనూ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)కు చోటివ్వలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకే ఇష్టపడుతున్న కోహ్లీ.. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కూర్పునే కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో పిచ్‌లు పేసర్లకు సహకరించాయి. ఐతే మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో నాలుగో టెస్టులో అశ్విన్‌ను తీసుకోవాలని విశ్లేషకులు సూచించారు. భారత మాజీలతో సహా క్రికెట్ దిగ్గజాలు, కామెంటేటర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఓవల్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని రికార్డులు చెబుతున్నాయి. ఓవల్ పిచ్ పేస్‌కు అంతగా అనుకూలించదని అంటారు. దేశవాళీ క్రికెట్లో సర్రే జట్టు అక్కడ ఐదు మ్యాచులు ఆడగా మూడింట్లో ఎవరినీ విజయం వరించలేదు. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇక్కడ కౌంటీ క్రికెట్ ఆడాడు.
The non selection of @ashwinravi99 has to be greatest NON selection we have ever witnessed across 4 Tests in the UK !!! 413 Test wickets & 5 Test 100s !!!! #ENGvIND Madness …
— Michael Vaughan (@MichaelVaughan) September 2, 2021
సర్రే, సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. అదీకాకుండా పిచ్ అనుకూలత, ఇంగ్లండ్ జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం, వైవిధ్యమైన బంతులు వేయగల అనుభవం ఉండటంతో అశ్విన్‌కు చోటు దొరుకుతుందని చాలామంది అంచనా వేశారు.
Greatest non-selection, ever. For Kohli, ego over everything. #Ashwin
— Rajesh Abraham🇮🇳 (@pendown) September 2, 2021
So called template...kya bakwas hai...man my advice to Ashwin @ashwinravi99 man ask BCCI to release you so that you can join the IPL camp in Dubai...no use sitting here on the bench...@BCCI
— Kuncjens (@kuncjens) September 2, 2021
The Indian team did not realize how good he was at taking wickets! #ENGvIND #Ashwin pic.twitter.com/iWpySgPIHm
— Monish MSDian™ (@Monish_dhoni) August 26, 2021
కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో కూడిన భారత జట్టు యాజమాన్యం మాత్రం ఆఖర్లో షాకిచ్చారు. రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే నాలుగో టెస్టులో భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకుంది.
టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికపై స్పందించాడు. ఇంగ్లండ్ జట్టులో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నాం. అతడు వారిని నిలువరించగలడు. జడ్డు ఏడో స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి జట్టు సమతూకంగా మారుతుంది. బ్యాటింగ్ స్ట్రాంగ్ గా మారుతోంది' అని కోహ్లీ వివరించాడు.
అయితే, కోహ్లీ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్లపై అశ్విన్ కున్న రికార్డును గుర్తు చేశారు. ఇక, రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ మైఖేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భారత్ నిర్ణయాన్ని పిచ్చిపనిగా అభివర్ణించాడు. "నాలుగు టెస్ట్‌లలో మనం చూసిన గొప్ప నాన్ సెలక్షన్ ఎంపిక ఇదే. అశ్విన్‌ను పక్కనపెట్టడం ఏంటి. 413 టెస్టు వికెట్లు, 5 టెస్టు సెంచరీలు చేసిన అశ్విన్ లాంటి ఆటగాడిని పక్కనపెట్టడం ఘోర తప్పిదం" అని వాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట అయింది.
ఇది కూడా చదవండి : వావ్.. ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసుండరు.. ఈ వీడియో గుండెలకు హత్తుకోవడం ఖాయం..
అశ్విన్ తుది జట్టులో లేకపోవడంపై భారత కామెంటేటర్లు హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అశ్విన్ ఎంపిక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని మంజ్రేకర్ పేర్కొనగా.. యాష్ నెట్స్‌లో తెల్లటి బంతితో బౌలింగ్ చేస్తే ఆశ్చర్యపోతా అని భోగ్లే ట్వీట్ చేశాడు.
మరోవైపు నాలుగు టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు జట్టులో ప్లేస్ దక్కకపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత ఫాన్స్ మండిపడుతున్నారు. ఒకవైపు ట్వీట్ల వర్షం కురిపిస్తూ.. మరోవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. " ఎప్పటికైనా ఇది చెత్త ఎంపిక. విరాట్ కోహ్లీకి అంత అహం ఎందుకు.. ఆర్ అశ్విన్‌నే ఆడించడా?'" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. " అశ్విన్ లేడుగా.. ఈ మ్యాచ్ కూడా పోయినట్టే" అని ఇంకొకరు ట్వీట్ చేశారు. " యాష్ లేడా.. జట్టు ఎంపికపై ఆశ్చర్యం వేస్తోంది" అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి : చరిత్ర సృష్టించిన అవని లేఖరా.. తొలి ఇండియన్ గా అరుదైన ఘనత..
అశ్విన్ ఈ సిరీసులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.వరల్డ్ నెం. 2 బౌలర్ అయిన అశ్విన్ ను జట్టులోకి తీసుకోకపోవడం నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. జడేజాతో పోలీస్తే.. అశ్విన్ కు ఇంగ్లండ్ పై బెటర్ రికార్డు ఉంది. అంతేగాక, కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అలాంటి, అశ్విన్ పక్కన పెట్టడం భారత క్రికెట్ ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Ravichandran Ashwin, Ravindra Jadeja, Sports, Virat kohli