Home /News /sports /

Ind Vs Eng : టీమిండియా దెబ్బకి ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు.. మూడో టెస్ట్ కి టీ20 స్పెషలిస్ట్..

Ind Vs Eng : టీమిండియా దెబ్బకి ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు.. మూడో టెస్ట్ కి టీ20 స్పెషలిస్ట్..

Ind Vs Eng

Ind Vs Eng

Ind Vs Eng : లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు (Team India) చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అసలు చివరి రోజు టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మహా అయితే డ్రా చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లీ సేన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకుంది.

ఇంకా చదవండి ...
  లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు (Team India) చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అసలు చివరి రోజు టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మహా అయితే డ్రా చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లీ సేన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకుంది. ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. అయితే, లార్డ్స్ దెబ్బకి ఇంగ్లండ్ మిగిలిన టెస్టుల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. ఇందుకోసం మూడో టెస్టు నుంచే జట్టులో సమూల మార్పులకు చర్యలు చేపట్టింది. ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేసి.. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను జట్టులోకి తీసుకుంది. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీడ్స్‌లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ పోరు కూడా మొదటి రెండు టెస్టుల్లానే హోరాహోరీగా సాగనుంది. భారత్‌తో లీడ్స్‌లో ఈనెల 25 నుంచి జరిగే మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మూడో టెస్టు కోసం టీ20 స్పెసలిస్ట్ డేవిడ్​ మలాన్​ను జట్టులోకి తీసుకుంది. టాప్​ ఆర్డర్ బ్యాట్స్​మన్​ చివరి రెండు టెస్టుల్లో తడబడిన కారణంగా మలన్​కు ఆహ్వానం అందింది.అలాగే బ్యాట్స్​మెన్ డామ్ సిబ్లే, జాక్ క్రాలేను పక్కనపెట్టింది. దీంతో వీరు తిరిగి తమ కౌంటీ జట్లకు ఆడనున్నారు. జాక్​ లీచ్​ పేరును కూడా స్క్వాడ్​లో ప్రస్తావించలేదు. కానీ స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీకి ప్రత్యామ్నాయంగా ఇతడు జట్టుతోనే ఉండనున్నాడు. ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన వన్డే, టీ-20 సిరీస్ లో రాణించిన సీమర్‌ సాకిబ్‌ మహమూద్‌కూ చోటు కల్పించారు.

  డేవిడ్ మలన్


  మరో ఓపెనర్ రోరీ బర్స్న్​పై విమర్శలు వస్తున్నా మరోసారి అతడికి అవకాశం ఇచ్చింది జట్టు యాజమాన్యం. సిబ్లే గైర్హాజరుతో హసీబ్ హమీద్​కు ఓపెనర్​ అవకాశం రానుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం తన చివరి టెస్టు ఆడిన డేవిడ్ మలాన్‌... తాజా సీజన్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడి 199 పరుగులు చేశాడు. అయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న మలాన్‌.. దూకుడైన బ్యాటింగ్‌ శైలి తమ జట్టుకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఇంగ్లండ్‌ అతడిని టెస్టులోకి ఎంచుకునే సాహసం చేసింది. మలాన్‌ అయినా జట్టును ఆదుకుంటాడో లేదో వేచి చూడాలి. లార్డ్స్​లో భుజానికి గాయమైన స్టార్ పేసర్ మార్క్​ వుడ్ త్వరగా కోలుకోవాలని ఇంగ్లండ్ యాజమాన్యం ఆశిస్తోంది. ఒకవేళ వుడ్​ కోలుకోకపోతే.. పేసర్లు సకిబ్ మహ్మద్, క్రెయగ్ ఓవర్టన్ అతని స్థానాన్ని భర్తీ చేస్తారు.

  ఇంగ్లండ్ జట్టు : జో రూట్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ, జేమ్స్‌ అండర్సన్‌, జానీ బెయిర్‌స్టో, రోరి బర్న్స్‌, జోస్ బట్లర్‌, సామ్‌ కరన్, హసీబ్‌ హమీద్‌, డాన్‌ లారెన్స్‌, సాకిబ్‌ మహమూద్‌, డేవిడ్ మలాన్‌, క్రెయిగ్‌ ఒవర్టన్‌, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ ఉడ్‌.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs england, Sports, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు