హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Eng : " డీఆర్ఎస్ = డోంట్ రివ్యూ సిరాజ్ " .. ఓయ్ కోహ్లీ కాస్తా పంత్ మాట కూడా వినవయ్యా...

Ind Vs Eng : " డీఆర్ఎస్ = డోంట్ రివ్యూ సిరాజ్ " .. ఓయ్ కోహ్లీ కాస్తా పంత్ మాట కూడా వినవయ్యా...

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ind Vs Eng : హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరీ అద్భుతంగా అదరగొడుతున్నాడు. తన బౌలింగ్ మాయాజాలంతో ఇంగ్లాండ్ వరస వికెట్లు పడగొట్టాడు. అయితే.. మ్యాచ్ లో మాత్రం డీఆర్ఎస్ విషయంలో విఫలమయ్యాడు.

  భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నిలకడగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (48 నాటౌట్‌; 75 బంతుల్లో 6x4), జానీ బెయిర్‌స్టో (6 నాటౌట్‌; 17 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. సిబ్లీ (11), హమీద్‌ (0) నిరాశపర్చగా.. రోరీ బర్న్స్‌ (49; 136 బంతుల్లో 7x4) ఆకట్టుకున్నాడు. భారత పేసర్ మొహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్‌కు 245 పరుగులు వెనకబడి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరీ అద్భుతంగా అదరగొడుతున్నాడు. తన బౌలింగ్ మాయాజాలంతో ఇంగ్లాండ్ వరస వికెట్లు పడగొట్టాడు. అయితే.. మ్యాచ్ లో మాత్రం డీఆర్ఎస్ విషయంలో విఫలమయ్యాడు. సిరాజ్ ని నమ్మి.. అతని కోరిక మేరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సార్లు డీఆర్ఎస్( డెసిషన్ రివ్యూ సిస్టమ్) కోరాడు. అయితే.. రెండు సార్లు అది ఫెయిల్ అయ్యింది.

  రెండు సార్లు సిరాజ్ కారణంగా డీఆర్ఎస్ కోల్పోవడంతో.. మరో ఇండియన్ క్రికెటర్ వసీమ్ జాఫర్.. సిరాజ్ ని టీజ్ చేశాడు. సిరాజ్ ని ఆటపట్టిస్తూ.. డీఆర్ఎస్ కి కొత్త అర్థం చెప్పాడు. డీఆర్ఎస్ అంటే.. " డోంట్ రివ్యూ సిరాజ్" అంటూ ట్వీట్ చేశాడు. దాని పక్కన ఓ ఎమోజీని కూడా పెట్టాడు. అయితే.. వసీం జాఫర్ చేసిన ట్వీట్.. ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే, నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా సిరాజ్ పై సెటైర్లు వేస్తున్నారు. పంత్ నోరు మొత్తుకుని వద్దని చెబుతున్నా.. నీ ఆతృత వల్ల టీమిండియా రెండు అమూల్యమైన రివ్యూలు కోల్పయిదంటూ సెటైర్లు వేస్తున్నారు. ఫస్ట్ రెండు టెస్ట్ ల్లో ఇప్పటికే సిరాజ్ వల్ల విరాట్ కోహ్లీ ఐదు సార్లు రివ్యూ తీసుకున్నాడు. ఐదు సార్లు కూడా విఫలమయ్యాడు.

  అలాగే, విరాట్ కోహ్లీపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రిషబ్ పంత్, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు సంప్రదించకుండా.. సిరాజ్ అత్సాత్సుహన్ని పరిగణనలోకి తీసుకోని రివ్యూలు తీసుకోవడం ఏంటని కోహ్లీని ప్రశ్నిస్తున్నారు. రివ్యూ తీసుకోవడానికి కోచింగ్ తీసుకుంటే బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివిధరకాల మీమ్స్ తో హల్చల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ లో మొదటి రోజు కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండోరోజు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో 364 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs england, Mohammed Siraj, Rishabh Pant, Rohit sharma, Virat kohli

  ఉత్తమ కథలు