Home /News /sports /

IND VS ENG 2021 CAN YOU NOTICE THIS ROHIT SHARMAS STUNNING CATCH ON DAY 5 WATCH VIRAL VIDEO SRD

Viral Video : గెలిచిన ఆనందంలో రోహిత్ శర్మ పట్టిన ఈ సూపర్ క్యాచ్ ని చూసుండరు..? ఓ లుక్కేయండి..

Rohit Sharma (Twitter)

Rohit Sharma (Twitter)

Viral Video : ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. ఈ విక్టరీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు, ఫ్యాన్స్ మైమర్చిపోయారు. సంబరాల్లో మునిగి తేలారు. అయితే, లార్ట్స్ టెస్ట్ విజయానందంలో ఉన్న అందరూ.. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైమరిపించే ఫీల్డింగ్‌ను గుర్తించలేకపోయారు.

ఇంకా చదవండి ...
    లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు (Team India) చారిత్రాత్మక విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అసలు చివరి రోజు టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మహా అయితే డ్రా చేయడానికి ప్రయత్నిస్తుందని అనుకున్నారు. కానీ కోహ్లీ సేన లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకుంది. ఐదో రోజు అద్భుత ప్రదర్శనతో చరిత్రలో మిగిలిపోయే విజయాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. ఈ విక్టరీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు, ఫ్యాన్స్ మైమర్చిపోయారు. సంబరాల్లో మునిగి తేలారు. అయితే, లార్ట్స్ టెస్ట్ విజయానందంలో ఉన్న అందరూ.. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైమరిపించే ఫీల్డింగ్‌ను గుర్తించలేకపోయారు. స్లిప్‌లో ఒంటిచేత్తో అతను పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ను కనిపెట్టలేకపోయింది. అవును.. ఇప్పుడు గనుక మీరు ఆ వీడియోను చూస్తే వావ్ అంటూ నోరెళ్ల బెడతారు. అయితే రోహిత్ శర్మ అందుకున్న క్యాచ్ భారత విన్నింగ్ మూమెంట్ కావడంతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం ముందు రోహిత్ ఫీల్డింగ్ ఎఫర్ట్ చిన్నబోయింది.పూర్తి వివరాల్లోకెళితే.. మహమ్మద్ సిరాజ్ వేసిన 52 ఓవర్‌లో రెండో బంతికి బట్లర్ ఔటవ్వగా.. ఐదో బంతికి జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన ఆ బంతిని అండర్సన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్ స్టంప్స్‌ను లేపేసింది.

    అయితే స్టంప్స్ తాకిన బంతి నేరుగా స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు దూసుకెళ్లింది. దీంతో ఆ బంతిని రోహిత్ ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ వికెట్‌తో భారత విజయం లాంఛనమవడంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలారు. అయితే, రోహిత్ క్యాచ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. టీవీ రీప్లేలో కూడా రోహిత్ క్యాచ్ పట్టిన విషయం కనబడలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఎవరూ గుర్తించని రోహిత్ శర్మ సూపర్ క్యాచ్ అంటూ క్యాప్షన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నిజంగా అద్భుతమైన క్యాచని, విజయానందరంలో గుర్తించలేకపోయామని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.


    మరోవైపు భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. 89 ఏళ్ల చరిత్రలో లార్డ్స్‌లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. టీమ్ ఇండియా తొలి సారిగా 1932లో లార్డ్స్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇప్పటి వరకు భారత జట్టు 19 టెస్టులు ఆ చాతిత్రాత్మక మైదానంలో ఆడింది. కానీ ఏ కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. మరోవైపు 19 టెస్టుల్లో భారత జట్టు కేవలం 3 టెస్టులే గెలిచింది. 1986లో కపిల్ కెప్టెన్సీలో తొలి సారి లార్డ్స్‌లో మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2014లో ధోనీ కెప్టెన్సీలో గెలవగా... ఆ తర్వాత 7 ఏళ్లకు కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు లార్డ్స్ టెస్టు గెలిచింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs england, Mohammed Siraj, Rohit sharma, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు