హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG 1st ODI : బుమ్.. బుమ్.. బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ ఫసక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

IND vs ENG 1st ODI : బుమ్.. బుమ్.. బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ ఫసక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

PC : BCCI

PC : BCCI

IND vs ENG 1st ODI : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న తొలి వన్డే లో టీమిండియా (Team India) పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చెలరేగిపోయాడు. 7.2 ఓవర్ల స్పెల్ లో కేవలం  19 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా 6 వికెట్లతో చెలరేగిపోయాడు.

ఇంకా చదవండి ...

IND vs ENG 1st ODI : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న తొలి వన్డే లో టీమిండియా (Team India) పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చెలరేగిపోయాడు. 7.2 ఓవర్ల స్పెల్ లో కేవలం  19 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా 6 వికెట్లతో చెలరేగిపోయాడు. దాంతో ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో కేవలం 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. బుమ్రాకు తోడు మొహమ్మద్ షమీ కూడా చెలరేగిపోయాడు. షమీ 3 వికెట్లు తీశాడు. మిగిలిన ఒక్క వికెట్ ను ప్రసిధ్ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బట్లర్ (30; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. డేవిడ్ విల్లీ (21), బ్రైడన్ కర్సె (15) చివర్లో పోరాడటంతో ఇంగ్లండ్ 100 మార్కును అందుకోగలిగింది.

బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ టపాటపా

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను జస్ ప్రీత్ బుమ్రా ఒక ఆట ఆడుకున్నాడు. రెండో ఓవర్ లో జేసన్ రాయ్ (0), జో రూట్ (0) వికెట్లను తీశాడు. మరో ఎండ్ లో మొహమ్మద్ షమీ బెన్ స్టోక్స్ (0)ను పెవిలియన్ కు చేర్చాడు. ఆ వెంటనే జానీ బెయిర్ స్టో (7)ను బుమ్రా అవుట్ చేశాడు. లియామ్ లివింగ్ స్టోన్ (0) కూడా అవుటవ్వడంతో ఇంగ్లండ్ 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మొయిన్ అలీతో కలిసి బట్లర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు.  బుమ్రా మరోసారి చెలరేగడంతో ఇంగ్లండ్ ఒక దశలో 68 పరుగులకే 8 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. దాంతో వన్డేల్లో ఆ జట్టు అత్యధిక స్కోరు అయిన 86 పరుగులను కూడా దాటేలా కనిపించలేదు. చివర్లో డేవిడ్ విల్లీ, బ్రైడన్ పోరాడటంతో ఇంగ్లండ్ 100 మార్కును అందుకుంది.
శిఖర్ ఈజ్ బ్యాక్

చాలా రోజుల తర్వాత గబ్బర్ శిఖర్ ధావన్ టీమిండియా తరఫున కమ్ బ్యాక్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మళ్లీ అతడు బ్యాట్ పట్టింది లేదు. అయితే ఇంగ్లండ్ తో జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మకు తోడుగా ధావన్ భారత ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయనున్నాడు. ఇక కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

తుది జట్లు

టీమిండియా 

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, బుమ్రా, యుజువేంద్ర చహల్, షమీ, ప్రసిధ్

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, డేవిడ్ విల్లీ, ఓవర్టన్, కర్సే, రీస్ టొప్లే

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు