హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG : తొడగొట్టేందుకు సిద్ధమైన గబ్బర్.. రేపే తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే..

IND vs ENG : తొడగొట్టేందుకు సిద్ధమైన గబ్బర్.. రేపే తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే..

PC : BCCI

PC : BCCI

IND vs ENG : ఇంగ్లండ్ (England)తో మూడు మ్యాచ్ టి20 సిరీస్ అలా ముగిసిందో లేదో మరో సిరీస్ కు రేపు తెరలేవనుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. రోజు విరామం తర్వాత ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడేందుకు భారత్ (India) సిద్ధమైంది.

ఇంకా చదవండి ...

IND vs ENG : ఇంగ్లండ్ (England)తో మూడు మ్యాచ్ టి20 సిరీస్ అలా ముగిసిందో లేదో మరో సిరీస్ కు రేపు తెరలేవనుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. రోజు విరామం తర్వాత ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ఆడేందుకు భారత్ (India) సిద్ధమైంది. రేపు (మంగళవారం) ఇంగ్లండ్ లోని ది ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. వన్డే సిరీస్ కోసం భారత్ భారీ మార్పులు చేసింది. టి20 ఆడిన టీంను సగం వరకు మార్చింది. మరో వైపు ఊహించని విధంగా టి20 సిరీస్ లో ఓడిన బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ వన్డే సిరీస్ ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో రేపు సాయంత్రం 5.30 నుంచి ఆరంభమయ్యే ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరిగే అవకాశం ఉంది.

ఓపెనర్ గా గబ్బర్ కమ్ బ్యాక్

చాలా రోజుల తర్వాత శిఖర్ ధావన్ టీమిండియా తరఫున ఓపెనర్ గా పునరాగమనం చేయనున్నాడు. గత కొంత కాలంగా అతడు టీంకు దూరంగానే ఉన్నాడు. అయితే ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపికైన ధావన్.. రేపు జరిగే తొలి వన్డేలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ధావన్ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. అయితే అతడిని టి20లకు మాత్రం సెలెక్ట్ చేయకపోవడం అభిమానులను కాసింత ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

కోహ్లీ సంగతేంటి?

టీమిండియా అభిమానుల్లో విరాట్ కోహ్లీ గురించే ఎక్కువగా చర్చజరుగుతోంది. సెంచరీ గురించి దేవుడెరుగు ఫామ్ లోకి వచ్చి 50 ప్లస్ పరుగులు చేస్తే చాలు అనే స్థాయికి అతడి అభిమానులు చేరుకున్నారు.  ఈ ఏడాది ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో 11, 20 పరుగులు చేసిన అతడు.. టి20 సిరీస్ లో 1, 11 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతడిపై వేటు వేయాలంటూ మాజీ ప్లేయర్లు, టీమిండియా అభిమానులు బీసీసీఐపై ఒత్తిడి తెస్తున్నారు. టి20 ప్రపంచకప్ కు ఇంగ్లండ్ పర్యటనలో రాణించే ప్లేయర్లనే ఎంపిక చేస్తామని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వన్డే సిరీస్ లో అతడు కనీసం ఒక్క అర్ధ సెంచరీ అయినా సాధించాల్సి ఉంది. లేదంటే టి20 ప్రపంచకప్ కు అతడు డౌటే.

తుది జట్టు కూర్పు

ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ ధావన్ భారత ఇన్నింగ్స్ ను ఆరంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,  హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలు వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో భారత్ ముగ్గురు సీమర్లు ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ లెక్కన బుమ్రా, షమీ, యుజువేంద్ర చహల్ లు తుది జట్టులో ఖాయం. మూడో సీమర్ స్థానం కోసం ప్రసిధ్, సిరాజ్, అర్ష్ దీప్ లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, బుమ్రా, యుజువేంద్ర చహల్, షమీ, సిరాజ్/ప్రసిధ్/అర్ష్ దీప్ సింగ్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rohit sharma, Shikhar Dhawan, Team India, Virat kohli

ఉత్తమ కథలు