హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG 1st ODI : టాస్ గెలిచిన రోహిత్.. కోహ్లీ అవుట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

IND vs ENG 1st ODI : టాస్ గెలిచిన రోహిత్.. కోహ్లీ అవుట్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs ENG 1st ODI : ఇంగ్లండ్ (England)తో మరో ఆసక్తికర సమరానికి టీమిండియా (Team India) సిద్ధమైంది. లండన్ (London)లోని ది ఓవల్ మైదానంలో మరికొద్ది నిమిషాల్ల ో ఆరంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గాడు. వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఛేజింగ్ కు మొగ్గు చూపాడు.

ఇంకా చదవండి ...

IND vs ENG 1st ODI : ఇంగ్లండ్ (England)తో మరో ఆసక్తికర సమరానికి టీమిండియా (Team India) సిద్ధమైంది. లండన్ (London)లోని ది ఓవల్ మైదానంలో మరికొద్ది నిమిషాల్ల ో ఆరంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గాడు. వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఛేజింగ్ కు మొగ్గు చూపాడు. దాంతో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడు రోహిత్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. టి20 సిరీస్ కు రెస్ట్ తీసుకున్న బెన్ స్టోక్స్, జో రూట్, జానీ బెయిర్ స్టో మళ్లీ ఇంగ్లండ్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చారు.

గాయంతో కోహ్లీ అవుట్

మూడో టి20 ఆడుతూ కోహ్లీ గాయపడ్డాడు. గజ్జల్లో గాయం అవ్వడంతో సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో కోహ్లీ పాల్గొనలేదు. రూంకే పరిమితం అయ్యాడు. దాంతో అతడు తొలి వన్డే ఆడటం లేదని అప్పుడే వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ కానీ, టీమిండియా మేనేజ్ మెంట్ కానీ కోహ్లీ గాయంపై నోరు మెదపలేదు. అయితే టాస్ సమయంలో కోహ్లీ గాయం గురించి రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్ లో ఆడటం లేదని పేర్కొన్నాడు. అదే సమయంలో అర్ష్ దీప్ సింగ్ పొత్తి కడుపు గాయంతో ఉన్నాడని తెలిపాడు.

శిఖర్ బ్యాక్

చాలా రోజుల తర్వాత గబ్బర్ శిఖర్ ధావన్ టీమిండియా తరఫున కమ్ బ్యాక్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మళ్లీ అతడు బ్యాట్ పట్టింది లేదు. అయితే ఇంగ్లండ్ తో జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మకు తోడుగా ధావన్ భారత ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయనున్నాడు. ఇక కోహ్లీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

తుది జట్లు

టీమిండియా 

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, బుమ్రా, యుజువేంద్ర చహల్, షమీ, ప్రసిధ్

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, డేవిడ్ విల్లీ, ఓవర్టన్, కర్సే, రీస్ టొప్లే

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shikhar Dhawan, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు