IND vs BAN 2022 Schedule : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసిన వెంటనే భారత్ (India) ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ (New Zealand) పర్యటనలో ఉన్న భారత్.. అక్కడ వన్డే సిరీస్ ముగియగానే బంగ్లాదేశ్ (Bangladesh)లో పర్యటించనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కు సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ఇకపై సిరీస్ లను ఆడనుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ తో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కూడా ఉండనుంది. ఈ క్రమంలో భారత్ ఇకపై వన్డే, టెస్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో వన్డే, టెస్టు సిరీస్ లను ఆడనుంది. డిసెంబర్ 4న ఆరంభమయ్యే ఈ పర్యటన 26న ముగుస్తుంది.
న్యూజిలాండ్ పర్యటనక దూరంగా ఉన్నరెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీలు తిరిగి జట్టులోకి రానున్నారు. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే, టెస్టు సిరీస్ లకు వీరు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక గత కొంత కాలంగా పేలవ ఫామ్ లో ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లకు ఈ పర్యటన చాలా కీలకంగా మారింది. ఇందులో వీరు విఫలం అయితే మాత్రం వేటు పడే అవకాశం ఉంది.
వన్డే సిరీస్
ఎప్పుడు | ఎక్కడ | సమయం | |
తొలి వన్డే | డిసెంబర్ 4 | ఢాకా | మ.గం.12.30లకు |
రెండో వన్డే | డిసెంబర్ 7 | ఢాకా | మ.గం.12.30లకు |
మూడో వన్డే | డిసెంబర్ 10 | ఢాకా | మ.గం.12.30లకు |
టెస్టు సిరీస్
ఎప్పుడు | ఎక్కడ | సమయం | |
తొలి టెస్టు | డిసెంబర్ 14 నుంచి 18 వరకు | చట్టోగ్రామ్ | ఉ.గం.9.30లకు |
రెండో టెస్టు | డిసెంబర్ 22 నుంచి 26 వరకు | ఢాకా | ఉ.గం.9.30లకు |
లైవ్ టెలికాస్ట్
ఈ మ్యాచ్ లను సోనీ నెట్ వర్క్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. డిజిటల్ లో సోనీ లివ్ యాప్ లో ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ లను చూడవచ్చు. వీటితో పాటు డీడీ స్పోర్ట్స్ కూడా ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
టీమిండియా జట్టు (వన్డేలకు)
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, యస్ దయాల్, షాబాజ్ అహ్మద్, షమీ, దీపక్ చహర్
టీమిండియా జట్టు (టెస్టులకు)
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుబ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, పంత్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, సిరాజ్, షమీ, ఉమేశ్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, India vs bangladesh, Rohit sharma, Team India, Virat kohli