టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ లో దారుణ నిష్క్రమణ తర్వాత ఇప్పుడు వన్డే ప్రపంచకప్ పై దృష్టి సారించింది టీమిండియా. 2023 సంవత్సరంలో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి దాదాపు 11 నెలల సమయం ఉంది. దీంతో.. వన్డేలపై ఫోకస్ పెట్టింది భారత జట్టు. ఇక, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా(Team India) ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అయింది. బంగ్లాదేశ్ టూర్ (India Tour Of Bangladesh) కి సిద్ధమైంది. ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
కివీస్ పర్యటనలో కుర్రాళ్లు ఎక్కువ మంది బరిలోకి దిగారు. కానీ, ఇప్పుడు పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది టీమిండియా. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనుండటంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, ఈ వన్డే, టెస్ట్ సిరీస్ లను ఎక్కడ చూడాలి.. ఎప్పుడు మ్యాచులు ప్రారంభమవుతాయన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
మ్యాచ్ లు ఎప్పుడు ప్రారంభమవుతాయి..?
భారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి.
మ్యాచ్ లు ఏ ఛానెల్ లో చూడాలి..?
బంగ్లాదేశ్ టూర్ కు సంబంధించి.. సోనీ టీవీ నెటవర్క్ ప్రధాన బ్రాడ్‌కాస్ట్‌గా ఉంది. దీంతో సోనీ టెన్1, 2, 3, 4 ఛానెల్స్‌లో ప్రత్యక్షప్రసారం చూడొచ్చు. అలాగే డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌ను కూడా వీటిలో చూడొచ్చు.
ఏ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు..?
అయితే.. ఈ సిరీస్‌కు సంబంధించిన మ్యాచ్‌లేవీ హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ కావు. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లను జియో టీవీ యాప్ ద్వారా ఉచితంగా చూడొచ్చు. అలాగే.. సోనీ లీవ్ యాప్ ద్వారా కూడా మ్యాచుల్ని చూడవచ్చు.
ఇక, పూర్తి బలగంతో టీమిండియా ఈ మ్యాచులో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు రాకతో.. శ్రేయస్ అయ్యర్ కి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇక, వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. ధావన్.. రోహిత్ కు జోడిగా ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఆరు బౌలింగ్ ఆప్షన్లతో టీమిండియా బరిలోకి దిగే ఛాన్సు ఉంది. దీంతో.. బ్యాటింగ్ డెప్త్ అవసరం. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి బౌలింగ్ ఆల్ రౌండర్లు తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్సు ఉంది. ఇక, బౌలర్లుగా సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లు తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు.
టీమిండియా తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs BAN, India vs bangladesh, JIO TV, Rohit sharma, Shikhar Dhawan