టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ లో దారుణ నిష్క్రమణ తర్వాత ఇప్పుడు వన్డే ప్రపంచకప్ పై దృష్టి సారించింది టీమిండియా. 2023 సంవత్సరంలో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి దాదాపు 11 నెలల సమయం ఉంది. దీంతో.. వన్డేలపై ఫోకస్ పెట్టింది భారత జట్టు. ఇక, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా(Team India) ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అయింది. బంగ్లాదేశ్ టూర్ (India Tour Of Bangladesh) కి సిద్ధమైంది. ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగతున్న మ్యాచులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, టీమిండియా ఈ మ్యాచులో రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఇక, వన్డే సిరీస్ కు అతన్ని దూరం పెట్టింది బీసీసీఐ. టెస్టు జట్టుతో తిరిగి జాయిన్ కానున్నాడు.
కీపర్ గా రాహుల్ బాధ్యతలు మోయనున్నాడు. కుల్దీప్ సేన అరంగేట్రం చేయనున్నాడు. షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ల రూపంలో నలుగురు బౌలింగ్ ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతుంది టీమిండియా. కివీస్ పర్యటనలో కుర్రాళ్లు ఎక్కువ మంది బరిలోకి దిగారు. కానీ, ఇప్పుడు పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది టీమిండియా. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనుండటంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
???? Toss & Team News ???? Bangladesh have elected to bowl against #TeamIndia in the first #BANvIND ODI. Follow the match ???? https://t.co/XA4dUcD6iy A look at our Playing XI ???? pic.twitter.com/cwbB8cdXfP
— BCCI (@BCCI) December 4, 2022
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బరిలోకి దిగనున్నారు. వీరిద్దరికి వన్డే క్రికెట్ లో మంచి రికార్డు ఉంది. అలాగే, టీమిండియా బెస్ట్ ఓపెనింగ్ పెయిర్లలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడి కూడా ఉంది. అదిగాక లెఫ్ట్, రైట్ హ్యాంట్ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవుతుంది. అయితే.. వీరిద్దరిలో ఎవరు దూకుడుగా ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక, ఆరు బౌలింగ్ ఆప్షన్ లతో టీమిండియా బరిలోకి దిగింది. చాలా మంది ఆల్ రౌండర్లు ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక, బంగ్లాదేశ్ ను కూడా తక్కువ అంచనా వేయకూడదు. లిటన్ దాస్, షాంటో, షకీబ్ వంటి డేంజరస్ ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. ముస్తఫిజుర్ రహ్మన్, హసన్ మహ్మద్, ఎబాదోత్ హోస్సేన్ బౌలింగ్ లో ప్రమాదకరం.
తుది జట్లు :
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్
బంగ్లాదేశ్ : లిటన్ దాస్, అన్మల్ హోక్, నజ్మల్ హోస్సేన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సేన్, మెహదీ హసన్, హసన్ మహ్మద్, ముస్తఫిజుర్ రహ్మన్, ఎబాదోత్ హోస్సేన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Rohit sharma, Team India, Virat kohli