IND vs BAN 3rd ODI : బంగ్లాదేశ్తో జరగబోయే మూడో చివరి వన్డేలో.. టీమిండియా ప్లేయర్లైన రోహిత్ శర్మ, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.. ఆడట్లేదని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది. ఈ ప్రకటన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి నిన్నటి సెకండ్ వన్డేలో.. టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వీరోచిత పోరాటం చేశాడు. మ్యాచ్ కొద్దిలో ఓడిపోయినా.. గాయం నొప్పిని భరిస్తూ టీమిండియా విజయం కోసం రోహిత్ శర్మ చివరి వరకు పోరాడాడు. ఐతే.. ఆ గాయమే అతన్ని మూడో వన్డేకి దూరం చేస్తోందని తెలుస్తోంది.
దీపక్ చాహర్, కల్దీప్ సేన్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి బంగ్లాదేశ్ సిరీస్ విజేతగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఈనెల 10న జరిగే మూడో వన్డేలో గెలిచి.. పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఐతే.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడడు అనే అంశం అభిమానులను నిరాశ పరుస్తోంది. ఇలాగైతే మూడో వన్డే కూడా ఓడిపోతారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.
బంగ్లాదేశ్ లాంటి జట్టుతో సిరీస్ వాష్ అవుట్ అయితే.. అది టీమిండియాకి పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. అందువల్ల 10న జరిగే మ్యాచ్ ఎలా ఉంటుందో అనేది హాట్ డిబేట్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket