హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs BAN : మళ్లీ టాస్ ఓడిన టీమిండియా.. రోహిత్ స్థానంలో యంగ్ ప్లేయర్ కు ఛాన్స్.. బరిలోకి కుల్దీప్ యాదవ్..

IND vs BAN : మళ్లీ టాస్ ఓడిన టీమిండియా.. రోహిత్ స్థానంలో యంగ్ ప్లేయర్ కు ఛాన్స్.. బరిలోకి కుల్దీప్ యాదవ్..

బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా (ఫైల్ ఫోటో)

బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా (ఫైల్ ఫోటో)

IND vs BAN : టీమిండియా జోరుకు గాయాలు బ్రేకులు వేస్తున్నాయి. బుమ్రా, జడేజా.. ఇప్పుడు రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు లేకపోవడంతో భారత చాలా బలహీనంగా కనిపిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-0 తేడాతో టీమిండియా సిరీస్ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో గెలిచే స్థితిలో ఉన్న టీమిండియా.. అనూహ్యంగా చివరకు ఓటములే చవిచూసింది. రెండో వన్డేలో కూడా టాపార్డర్ విఫలం అవడంతో మిడిల్, లోయర్ మిడిలార్డర్‌పై భారం పడింది. చివర్లో గాయంతోనే బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో మూడో వన్డేలో పరువు కోసం పోరాడుతుంది. మరోవైపు.. టీమిండియాపై క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించాలని బంగ్లాదేశ్ ఉవ్విల్లూరుతుంది. ఛట్టోగ్రామ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. యాసిర్ అలీ, టస్కిన్ అహ్మాద్ తుది జట్టులోకి వచ్చారు. ఇక, టీమిండియా కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, దీపక్ చాహర్ స్థానాల్లో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

టీమిండియా జోరుకు గాయాలు బ్రేకులు వేస్తున్నాయి. బుమ్రా, జడేజా.. ఇప్పుడు రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు లేకపోవడంతో భారత చాలా బలహీనంగా కనిపిస్తోంది. మరోవైపు కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ వంటి బౌలర్లు కూడా గాయాలతో జట్టుకు దూరమయ్యారు.

రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్సీ చేస్తున్న కేఎల్ రాహుల్‌పై ఈ ఒత్తిడి మరింత ప్రభావం చూపుతుంది. ఇంత ఒత్తిడిని కెప్టెన్‌గా అనుభవం లేని రాహుల్ తట్టుకోలేడని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రాహుల్ కెప్టెన్సీ చేయగా.. ఆ సిరీస్‌ను భారత్ 3-0తో కోల్పోయిన సంగతి తెలిసిందే.

టెస్టులు, టీ20ల్లో బంగ్లాదేశ్ బలహీన జట్టే. కానీ వన్డేల్లో ఆ టీం రూటే సపరేటు. అది కూడా స్వదేశంలో సిరీస్ అంటే బంగ్లా మరింత బలంగా మారుతుంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌ ఆడిన చివరి 14 వన్డేల్లో కేవలం ఒక్కదాంట్లోనే ఆ జట్టు ఓడిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ చివరగా స్వదేశంలో వన్డే సిరీస్ ఓడింది 2016లో ఇంగ్లండ్ చేతిలో. ఆ తర్వాత మళ్లీ వన్డే సిరీస్ ఓడలేదు. భారత్‌తో జరిగిన రెండు వన్డేల్లో కూడా ఒత్తిడికి ఎదురొడ్డి ఆ జట్టు విజయం సాధించింది. షకీబుల్ హసన్, మెహదీ హసన్, ముస్తఫిజుర్ రహ్మాన్, మహ్మాదుల్లా రియాద్ డేంజరస్ ఆటగాళ్లు.

తుది జట్లు :

టీమిండియా : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్ : లిటన్ దాస్, అన్మల్ హోక్, షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సేన్, మెహదీ హసన్, ముస్తఫిజుర్ రహ్మన్, ఎబాదోత్ హోస్సేన్, టస్కిన్ అహ్మాద్

First published:

Tags: Cricket, IND vs BAN, India vs bangladesh, KL Rahul

ఉత్తమ కథలు