బంగ్లాదేశ్ (Bangladesh) తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా (Team India) దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. ఇక, శనివారం మూడో వన్డే జరగనుంది. బంగ్లాదేశ్ లాంటి జట్టుతో సిరీస్ వాష్ అవుట్ అయితే.. అది టీమిండియాకి పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. అంతే కాకుండా టీమిండియా పరువు పోతుంది. దీంతో.. టీమిండియా ఈ మ్యాచులో గెలవాలని భావిస్తుంది. అయితే, ఈ మ్యాచుకి ముందు టీమిండియా స్క్వాడ్ లో కీలక మార్పులు జరిగాయి. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) శనివారం జరిగే చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఈ మేరకు రోహిత్ గాయంపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. వేలికి గాయంతోనే రెండో వన్డేలో అద్భుతమైన పోరాటం చేసిన విషయం తెలిసిందే. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు.
బంగ్లాదేశ్‌తో జరగబోయే మూడో చివరి వన్డేలో.. టీమిండియా ప్లేయర్లైన రోహిత్ శర్మ, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.. ఆడట్లేదని బీసీసీఐ తెలిపింది. రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ వేలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో స్కానింగ్ తీయించుకొని వచ్చాడు. అయితే తదుపరి చికిత్స కోసం రోహిత్ ముంబైకి వెళ్లాడు. దీంతో శనివారం జరిగే మూడో వన్డేలో ఆడడు.
???? NEWS ????: Kuldeep Yadav added to #TeamIndia squad for the final ODI against Bangladesh. #BANvIND Other Updates & More Details ????https://t.co/8gl4hcWqt7
— BCCI (@BCCI) December 9, 2022
అయితే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేది ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ. అలాగే కుల్దీప్సేన్, దీపక్ చాహర్ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరు. మొదటి వన్డే ముగిసిన తర్వాత కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో రెండో మ్యాచుకు దూరమయ్యాడు. అందుకే రెండో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. ఇక, దీపక్ చాహర్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. దీంతో, అతన్ని పక్కన పెట్టింది బీసీసీఐ. ఈ ఇద్దరూ ఎన్సీఏకి వెళ్లనున్నారు.
బంగ్లాతో చివరి వన్డేకి ముగ్గురు ఆటగాళ్లు దూరం కావడంతో బీసీసీఐ మేనేజ్మెంట్ భారత జట్టును ప్రకటించింది. తాజాగా కుల్దీప్ యాదవ్ స్క్వాడ్‌లోకి వచ్చాడు. అయితే దీపక్, కుల్దీప్, రోహిత్ లేకపోవడంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టీమిండియా స్వ్యాడ్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షహబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, India vs bangladesh, KL Rahul, Rohit sharma, Virat kohli