హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs BAN 2nd Test : అశ్విన్, శ్రేయస్ అదుర్స్.. ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ విక్టరీ..

IND vs BAN 2nd Test : అశ్విన్, శ్రేయస్ అదుర్స్.. ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ విక్టరీ..

PC : BCCI

PC : BCCI

IND vs BAN 2nd Test : విచంద్రన్ అశ్విన్ (62 బంతుల్లో 42 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయస్ అయ్యర్ (46 బంతుల్లో 29 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు) అజేయులుగా నిలవడంతో టీమిండియాకు సూపర్ విక్టరీని అందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత్ (Bangladesh), బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విక్టరీ కొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో టీమిండియా మూడు వికెట్లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రవిచంద్రన్ అశ్విన్ (62 బంతుల్లో 42 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయస్ అయ్యర్ (46 బంతుల్లో 29 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు) అజేయులుగా నిలవడంతో టీమిండియాకు సూపర్ విక్టరీని అందించారు. ఈ ఇద్దరితో పాటు అక్షర్ పటేల్ కూడా 69 బంతుల్లో 34 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విక్టరీతో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను గెలుచుకుంది. బంగ్లా బౌలర్లలో మెహాదీ హసన్ ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. షకీబ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, పుజారా, గిల్, పంత్ విఫలమైనప్పటికీ.. అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ల పోరాటం టీమిండియాను విజేతగా నిలిపింది.

45/4 ఓవర్ నైట్ స్కోరు తో నాలుగో రోజు ఆట ఆరంభించిన టీమిండియాకు బంగ్లాదేశ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. మొదటగా నైట్ వాచ్ మన్ జయదేవ్ ఉనాద్కత్ ను షకీబ్ పెవిలియన్ బాట పట్టించాడు. 13 పరుగులు చేసిన ఉనాద్కత్.. ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, ఫాంలో ఉన్న రిషబ్ పంత్ టీమిండియాను ఆదుకుంటాడని ఫ్యాన్స్ భావించారు.

అయితే, 9 పరుగులు చేసిన పంత్ ను అద్భుతమైన బంతితో ఎల్బీగా పెవిలియన్ బాట పట్టించాడు మెహదీ హసన్. ఆ కాసేపటికే ఈ ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడిన అక్షర్ పటేల్ కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు మెహదీ హసన్. 34 పరుగులు చేసిన అక్షర్ పటేల్ ను ఔట్ చేయడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే.. కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆదుకున్నారు శ్రేయస్ అయ్యర్, అశ్విన్.

ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఫస్ట్ లో డిఫెన్స్ కు ప్రాధాన్యమిచ్చిన ఈ జోడి.. ఆ తర్వాత.. వరుస బౌండరీలతో బంగ్లా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్.. సూపర్ గా ఆడాడు. అశ్విన్ కాస్త తడబడ్డ.. కీలక ఇన్నింగ్స్ తో టీమిండియాను ఆదుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య 50 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదైంది. ఇదే ఆటతో.. టీమిండియాను విజయ తీరాలకు చేర్చింది ఈ జోడి.

బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో మెరిశాడు.మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తరఫున లిట్టన్ దాస్ (98 బంతుల్లో 78; 7 ఫోర్లు) ఒంటిరి పోరాటం చేశాడు. నురుల్ హసన్ (31), టస్కిన్ అహ్మద్ (31)తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. జకీర్ హసన్ (51) రాణించాడు. దాంతో భారత్ కంటే 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఒక దశలో బంగ్లా జట్టు 133 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లిట్టన్ దాస్ వీరోచిత పోరాటం చేశాడు. నురుల్ హసన్, తస్కిన్ అహ్మద్ లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో బంగ్లాదేశ్ స్కోరు 200 మార్కును దాటింది. సెంచరీవైపు వెళ్తున్న లిట్టన్ దాస్ ను సిరాజ్ అవుట్ చేశాడు. తైజుల్ ఇస్లామ్ (1)ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆఖర్లో ఖలేద్ అహ్మద్ (4) రనౌట్ అయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత

First published:

Tags: Cricket, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Ravichandran Ashwin, Shreyas Iyer

ఉత్తమ కథలు