బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. మూడో రోజు తొలి సెషన్ లో టీమిండియా బౌలర్లు సత్తా చాటితే.. రెండో సెషన్ లో బంగ్లా బ్యాటర్లు ధీటుగా సమాధానమిచ్చారు. మూడో రోజు టీ విరామానికి బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లిటన్ దాన్ ( 78 బంతుల్లో 58 పరుగులు నాటౌట్: 5 ఫోర్లు), టస్కిన్ అహ్మద్ ( 18 బంతుల్లో 15 పరుగులు నాటౌట్ : 2 ఫోర్లు) ఉన్నారు. రెండో సెషన్ లో ఏకంగా 124 పరుగులు చేసింది బంగ్లాదేశ్. టీమిండియా మూడు వికెట్లు మాత్రమే తీసింది. ప్రస్తుతం పరుగుల ఆధిక్యంలో ఉంది బంగ్లాదేశ్. జకీర్ హసన్ (135 బంతుల్లో 51 పరుగులు ; 5 ఫోర్లు), నురుల్ హసన్ (29 బంతుల్లో 31 పరుగులు ; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఉమేష్, సిరాజ్, జయదేవ్, అశ్విన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
మూడో రోజు లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. రెండో సెషన్ లో మాత్రం దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీ తర్వాత జకీర్ హసన్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ ఔటయ్యాడు. ఆ కాసేపటికే లిటన్ దాస్ కూడా అక్షర్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. దీంతో..113 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. లిటన్ దాస్, నురుల్ హసన్.. టీమిండియా ఆనందాన్ని క్షణాల్లో ఆవిరి చేశారు. ఈ ఇద్దరూ ఎదురుదాడికి దిగారు. నురుల్ హసన్ రావడం రావటంతోనే తన ఉద్దేశం ఎంటో చాటి చెప్పాడు. నురుల్ హసన్ దూకుడు ఆటను చూసి.. లిటన్ దాస్ కూడా బ్యాట్ కు పని చెప్పాడు. ఈ ఇద్దరూ వేగంగా 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
That's Tea on Day 3 of the 2nd Test.
Bangladesh are 7 down, with a lead of 108 runs. Scorecard - https://t.co/XZOGpedIqj #BANvIND pic.twitter.com/RInzUQJ2gt — BCCI (@BCCI) December 24, 2022
అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అక్షర్ విడదీశాడు. 31 పరుగులు చేసిన నురుల్.. స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన టస్కిన్ కూడా బ్యాట్ కు పనిచెప్పాడు. మరో ఎండ్ లో లిటన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో.. బంగ్లా ఆధిక్యం 100 పరుగులు దాటింది. ఎంత త్వరగా బంగ్లాను ఆలౌట్ చేస్తే అంత మంచిది టీమిండియాకు. లేకపోతే.. ఈ స్పిన్ ట్రాక్ పై కఠినమైన లక్ష్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.
ఇక, అంతకుముందు.. ఓవర్ నైట్ స్కోరు 7/0 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. అశ్విన్ జోరుకు జట్టు స్కోరు 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. ఐదు పరుగులు చేసిన షాంటో అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో మొమినుల్ హక్ కూడా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ షకీబ్ తో కలిసి జకీర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ కాసేపు టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అయితే, ఈ జోడి జోరుకు బ్రేకులు వేశాడు జయదేవ్.
బంగ్లా కెప్టెన్ షకీబ్ ను బోల్తా కొట్టించాడు. షకీబ్ 13 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ముష్ఫీకర్ రహీమ్ 9 పరుగులు చేసి.. అక్షర్ పటేల్ ఔలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు జకీర్ హసన్. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, Cricket, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Ravichandran Ashwin