బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దుమ్మురేపుతుంది. ముఖ్యంగా టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. మూడో రోజు లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది బంగ్లాదేశ్. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక, బంగ్లా దేశ్ 16 పరుగులు వెనుకబడి ఉంది. బంగ్లా బ్యాటర్లలో జకీర్ హసన్ మాత్రమే అడ్డుగోడగా నిలిచాడు. ప్రస్తుతం క్రీజులో జకీర్ హసన్ ( 96 బంతుల్లో 37 పరుగులు నాటౌట్ ; 5 ఫోర్లు), లిటన్ దాస్ (0 నాటౌట్) ఉన్నారు. మిగతా బ్యాటర్లు షాంటో (5), మొమినుల్ (5), షకీబ్ (13), ముష్ఫీకర్ రహీమ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్, జయదేవ్, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు.
ఓవర్ నైట్ స్కోరు 7/0 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. అశ్విన్ జోరుకు జట్టు స్కోరు 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. ఐదు పరుగులు చేసిన షాంటో అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో మొమినుల్ హక్ కూడా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో.. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ షకీబ్ తో కలిసి జకీర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ కాసేపు టీమిండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అయితే, ఈ జోడి జోరుకు బ్రేకులు వేశాడు జయదేవ్.
Lunch on Day 3 of the 2nd Test.#TeamIndia bowlers pick up 4 wickets in the morning with Bangladesh 71/4, trail by 16 runs. Scorecard - https://t.co/CrrjGfXPgL #BANvIND pic.twitter.com/5qLWSmj5fG
— BCCI (@BCCI) December 24, 2022
బంగ్లా కెప్టెన్ షకీబ్ ను బోల్తా కొట్టించాడు. షకీబ్ 13 పరుగులు చేసి శుభ్ మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ముష్ఫీకర్ రహీమ్ 9 పరుగులు చేసి.. అక్షర్ పటేల్ ఔలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు జకీర్ హసన్.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్‌మెన్ లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలతో రాణించారు. ఈ మిడిలార్డర్ బ్యాటర్లు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ పంత్, అయ్యర్ తమ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు.
వీరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కేఎల్ రాహుల్ 10, శుభ్‌మన్ గిల్ 20, ఛటేశ్వర్ పుజారా 24, విరాట్ కోహ్లీ 24, రిషబ్ పంత్ 93, శ్రేయాస్ అయ్యర్ 87, అక్షర్ పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 12, జయదేవ్ 14(నాటౌట్), ఉమేశ్ యాదవ్ 14, మొహమ్మద్ సిరాజ్ 7 పరుగులు చేశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, తైజుల్ ఇస్లాం నాలుగేసి వికెట్లు తీశారు. అహ్మద్, మెహిదీ హసన్ కు చెరో వికెట్టు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో నజ్ముల్ 24, జకీర్ హసన్ 15, మొమిన్ 84, షకీబ్ అల్ హసన్ 16, ముస్లఫికర్ రహీం 26, లిట్టోన్ 25, మెహిదీ 15, నురూల్ హసన్ 6, టస్కిన్ అహ్మద్ 1, తైజుల్ ఇస్లాం 4, ఖలెద్ అహ్మద్ 0 పరుగులు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs BAN, India vs bangladesh, Mohammed Siraj, Ravichandran Ashwin