బంగ్లాదేశ్ (Bangladesh)తో డూ ఆర్ డై మ్యాచ్ కు భారత్ (India) సిద్ధమైంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో భారత్ వికెట్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండో వన్డేలో టీమిండియా (Team India) తప్పకుండా నెగ్గాల్సి ఉంది. ఒక వేళ ఓడితే మాత్రం సిరీస్ బంగ్లాదేశ్ ఖాతాలోకి వెళుతుంది. రెండు రోజుల విరామం తర్వాత మిర్పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకు అటు భారత్, ఇటు బంగ్లాదేశ్ లు సిద్ధమయ్యాయి. షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో బంగ్లాదేశ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. షెబాజ్ అహ్మద్, కుల్దీప్ సేన్ లపై వేటు పడింది. మరోవైపు.. హసన్ మహ్మద్ బదులు నసుమ్ ని ఆడిస్తుంది బంగ్లాదేశ్.
తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన చేసిన భారత్ చేజేతులా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో కేవలం 186 పరుగులే చేసింది. స్టార్ ప్లేయర్లు రోహిత్, ధావన్, కోహ్లీలు దారుణంగా విఫలం అయ్యరు. కేఎల్ రాహుల్ ఆడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అనంతరం బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు దిగగా ఆరంభంలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ లు కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ ను గెలుపు వైపు నడిపారు.
A look at our Playing XI for the 2nd ODI. Kuldeep Sen complained of back stiffness following the first ODI on Sunday. The BCCI Medical Team assessed him and has advised him rest. He was not available for selection for the 2nd ODI.#BANvIND pic.twitter.com/XhQxlQ6aMZ
— BCCI (@BCCI) December 7, 2022
బంగ్లాదేశ్ 136 పరుగుల వద్ద 9వ వికెట్ ను కోల్పోయింది. ఆ క్షణంలో భారత్ దే విజయం అని అంతా అనుకున్నారు. అయితే మెదీ హసన్ మిరాజ్ విరోచిత పోరాటంతో పాటు కేెల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం.. పేలవ బౌలింగ్ తో విజయాన్ని బంగారు పళ్లెంలో పెట్టి బంగ్లాదేశ్ కు అప్పగించింది భారత్. అయితే తొలి వన్డేలో చేసిన తప్పులను సరి చేసుకుని రెండో వన్డేలో రెచ్చిపోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
ఫస్ట్ వన్డేలో కేఎల్ రాహుల్ ఒక్కడే బ్యాటింగ్ లో ఫర్వాలేదన్పించాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ స్పిన్ ఆడటంలో తడబడ్డారు. అయితే, కీలకమైన ఈ మ్యాచులో వీరి రాణించాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ తన షార్ట్ బౌన్సర్లకు ఔట్ అయ్యే లోపాన్ని అధిగమించాల్సి ఉంది. బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నారు. వీరితో పాటు మిగతా బౌలర్లు కూడా రాణించాల్సి ఉంది.
ఇక, బంగ్లాదేశ్ ను కూడా తక్కువ అంచనా వేయకూడదని టీమిండియాకు ఇప్పటికే అర్ధమైంది. లిటన్ దాస్, షాంటో, షకీబ్, మెహదీ హసన్ వంటి డేంజరస్ ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు. ముస్తఫిజుర్ రహ్మన్, హసన్ మహ్మద్, ఎబాదోత్ హోస్సేన్ తమ బౌలింగ్ తో టీమిండియాకు సవాల్ విసరనున్నారు.
తుది జట్లు :
టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
బంగ్లాదేశ్ : లిటన్ దాస్, అన్మల్ హోక్, నజ్మల్ హోస్సేన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, అఫిఫ్ హోస్సేన్, మెహదీ హసన్, నసుమ్, ముస్తఫిజుర్ రహ్మన్, ఎబాదోత్ హోస్సేన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs BAN, India vs bangladesh, KL Rahul, Rohit sharma, Umran Malik, Virat kohli