Virat Kohli Catch : బంగ్లాదేశ్ (Bangladesh)తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ (India) పోరాడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా (Team India) 41.2 ఓవర్లలో 186 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే ఫర్వలేదనిపించాడు. కేఎల్ రాహుల్ ఆడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ప్రపంచకప్ తర్వాత టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేసిన రోహిత్ శర్మ (27), కోహ్లీ (9) నిరాశ పరిచారు. శిఖర్ ధావన్ (7) మరోసారి విఫలం అయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. ఎబాదత్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ తొలి బంతికే షాంటో (0) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత అన్ముల్ హక్ (14)ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చాడు. లిట్టన్ దాస్ (41) ఫర్వాలేదనిపించాడు.
అయితే సీనియర్ ప్లేయర్ షకీబుల్ హసన్ ను సూపర్ క్యాచ్ తో కోహ్లీ పెవిలియన్ కు చేర్చాడు. 24వ ఓవర్ వేయడానికి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ కు వచ్చాడు. ఆ ఓవర్ మూడో బంతిని షకీబుల్ హసన్ ఎక్స్ ట్రా కవర్స్ లోకి షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి కోహ్లీకి కాస్త దూరంగా వెళ్లింది. అయితే కోహ్లీ తన కుడి వైపునకు గాల్లోకి జంప్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దాంతో 29 పరుగులతో నిలకడగా ఆడుతున్న షకీబుల్ హసన్ పెవిలియన్ కు చేరక తప్పలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Stunning catch from Virat Kohli ????????#ViratKohlipic.twitter.com/gGPZZMukPr
— Vardhan???? (@VVK_09) December 4, 2022
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంబం చేయలేకపోయారు. వన్డే సిరీస్ నుంచి రిషభ్ పంత్ తప్పుకోవడంతో.. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే తొలి వన్డేలో రాహుల్ మిడిలార్డర్ లో ఆడటం విశేషం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు శిఖర్ ధావన్ వచ్చారు. ఒత్తిడిలో ఉన్న ధావన్ విఫలం అయ్యాడు. ఇక 4 ఫోర్లు, 1 సిక్సర్ తో టచ్ లో కనిపించిన రోహిత్ శర్మ షకీబుల్ హసన్ బంతికి బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే లిట్టన్ దాస్ పట్టిన అద్భుత క్యాచ్ కు కోహ్లీ కూడా పెవలియన్ కు చేరాడు. దాంతో భారత్ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో కాసేపు బంగ్లాదేశ్ బౌలర్లను రాహుల్, శ్రేయస్ అయ్యర్ (24) ఆదుకున్నారు. వీరు నెమ్మదిగా ఆడుతు ఒక్కో పరుగు జోెడించారు. అయితే ఎబాదత్ వీరిని విడదీశాడు. శ్రేయస్ ను పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఇక్కడి నుంచి భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, India vs bangladesh, KL Rahul, Rohit sharma, Team India, Virat kohli