Rohit Sharma : బంగ్లాదేశ్ (Bangladesh)తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ (India) ఓటమితో ఆరంభించింది. దాంతో సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 187 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు ఒక దశలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో ఆ జట్టు విజయానికి 63 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. ఈ స్థితిలో బంగ్లాదేశ్ అభిమానులు కూడా టీమిండియానే గెలుస్తుందనే అభిప్రాయానికి వచ్చారు. అయితే మెదీ హసన్ మిరాజ్ (39 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ముస్తఫిజుర్ రహ్మాన్ (11 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) భారత్ జట్టును ఓడించారు. వీరి వీరోచిత పోరాటానికి టీమిండియా పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కూడా తోడయ్యాయి. దాంతో గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ వికెట్ తేడాతో ఓడింది.
ఇక మ్యాచ్ లో మెదీ హసన్ ఇచ్చిన క్యాచ్ ను రాహుల్ మిస్ చేశాడు. ఆ తర్వాతి బంతికే మెదీ హసన్ ఆడిన షాట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. అయితే వాషింగ్టన్ సుందర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో ఆగ్రహించిన రోహిత్.. వాషింగ్టన్ సుందర్ ను బండబూతులు తిట్టాడు. ‘వాట్ ద..’ అంటూ ఆగిపోయాడు. ఆ తర్వాత మరీ దారుణమైన పదాన్ని ప్రయోగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడిలో వైరల్ అవుతుంది.
— Rahul Chauhan (@ImRahulCSK11) December 4, 2022
We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM
— Tanay Vasu (@tanayvasu) December 4, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే ఫర్వలేదనిపించాడు. కేఎల్ రాహుల్ ఆడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ప్రపంచకప్ తర్వాత టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేసిన రోహిత్ శర్మ (27), కోహ్లీ (9) నిరాశ పరిచారు. శిఖర్ ధావన్ (7) మరోసారి విఫలం అయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. ఎబాదత్ 4 వికెట్లతో రాణించాడు.
187 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ను దీపక్ చహర్ తొలి బంతికే దెబ్బ తీశాడు. షాంటోను (0) ఇన్నింగ్స్ తొలి బంతికే పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికే అన్ముల్ హక్ (14)ను సిరాజ్ అవుట్ చేశాడు. అయితే కెప్టెన్ లిట్టన్ దాస్.. సీనియర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ (29)తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరు ఆచితూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే లిట్టన్ ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్ కు షకీబ్ పెవిలియన్ కు చేారాడు. మళీ బౌలింగ్ కు వచ్చిన సిరాజ్ వెంట వెంటనే వికెట్లు తీశాడు. ఇక తొలి మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ సేన్ రెండు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. దాంతో భారత్ విజయం సులభం అని అంతాా అనుకున్నారు. అయితే మెదీ హసన్ మిరాజ్ భారత ఆశలపై తన అద్భుత ఇన్నింగ్స్ తో నీళ్లు చల్లాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, KL Rahul, Mohammed Siraj, Rohit sharma, Team India, Virat kohli