IND vs BAN 1st ODI : 39వ ఓవర్ 3వ బంతికి హసన్ మహ్ముద్ (0)ను మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అవుట్ చేశాడు. దాంతో భారత్ (India)తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ (Bangladesh) గెలవాలంటే 63 బంతుల్లో 51 పరుగులు చేయాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. క్రీజులో మదీ హసన్ మిరాజ్ (39 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ముస్తఫిజుర్ రహ్మాన్ (11 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఒక్క వికెట్ అవసరం.. అదే సమయంలో బంగ్లాదేశ్ నెగ్గాలంటే 51 పరుగులు కావాలి. అప్పటి పరిస్థితిని చూస్తే టీమిండియాకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అయితే ఆఖర్లో మెదీ హసన్ మిరాజ్ సూపర్ బ్యాటింగ్ కు భారత్ పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ టీమిండియా ఓటమికి కారణమయ్యాయి. పట్టుదలగా ఆడిన మెదీ హసన్ బంగ్లాదేశ్ ను వికెట్ తీడాతో గెలిపించాడు. 46 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసి బంగ్లాదేశ్ భారత్ పై బంపర్ విక్టరీని సాధించింది. కెప్టెన్ లిట్టన్ దాస్ (63 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సిరాజ్ 3 వికెట్లు తీసినా అతడి ప్రదర్శన ఓటమి పక్షానే నిలిచింది.
187 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ను దీపక్ చహర్ తొలి బంతికే దెబ్బ తీశాడు. షాంటోను (0) ఇన్నింగ్స్ తొలి బంతికే పెవిలియన్ కు చేర్చాడు. కాసేపటికే అన్ముల్ హక్ (14)ను సిరాజ్ అవుట్ చేశాడు. అయితే కెప్టెన్ లిట్టన్ దాస్.. సీనియర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ (29)తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరు ఆచితూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే లిట్టన్ ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్ కు షకీబ్ పెవిలియన్ కు చేారాడు. మళీ బౌలింగ్ కు వచ్చిన సిరాజ్ వెంట వెంటనే వికెట్లు తీశాడు. ఇక తొలి మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ సేన్ రెండు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. దాంతో భారత్ విజయం సులభం అని అంతాా అనుకున్నారు. అయితే మెదీ హసన్ మిరాజ్ భారత ఆశలపై తన అద్భుత ఇన్నింగ్స్ తో నీళ్లు చల్లాడు.
ఇది కూాడా చదవండి : ఇలానే ఆడితే వీరు ప్రపంచకప్ వరకు ఉండేది అనుమానమే.. ఎప్పుడంటే?
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే ఫర్వలేదనిపించాడు. కేఎల్ రాహుల్ ఆడకపోయి ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ప్రపంచకప్ తర్వాత టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేసిన రోహిత్ శర్మ (27), కోహ్లీ (9) నిరాశ పరిచారు. శిఖర్ ధావన్ (7) మరోసారి విఫలం అయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. ఎబాదత్ 4 వికెట్లతో రాణించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs BAN, India vs bangladesh, KL Rahul, Mohammed Siraj, Rohit sharma, Shikhar Dhawan, Team India, Virat kohli