Ind vs Aus : మీ త్యాగాల్ని ఎన్నటికీ మర్చిపోం..బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా

Ind vs Aus

Ind vs Aus : ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, టూర్ ను విజయవంతంగా ముగించిన టీమిండియాకు...

  • Share this:
    ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గబ్బా గర్జనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. ఈ విక్టరీతో భారత్ ఫ్యాన్స్ తో పాటు ఆస్ట్రేలియా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, టూర్ ను విజయవంతంగా ముగించిన టీమిండియాకు, సహకరించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. బీసీసీఐ సహకారంతోనే టీమిండియా పర్యటన విజయవంతంగా ముగిసిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ కూడా రాసింది. మీ త్యాగాల్ని ఎప్పుడూ మర్చిపోం అని క్రికెట్ ఆస్ట్రేలియా థ్యాంక్స్ చెప్పింది. మీ స్నేహం, నిబద్ధత, నమ్మకానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పర్యటన ఎన్నో కోట్ల మందిలో ఆనందం నింపిందని ఆ లేఖలో తెలిపింది.

    టూర్ లో వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా.. టీ 20, టెస్ట్ సిరీస్ లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా చూపించిన తెగువ, ధైర్యం, నైపుణ్యాలకు హ్యాట్సాఫ్ చెప్పింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. 60 ఏళ్ళ టీమిండియా క్రికెట్ ప్రస్థానంలో ఈ గెలుపు ఓ అద్భుతం. వెనక్కి వెళ్లి చరిత్ర పుటలను తిరిగేసినప్పుడు ఈ విజయాన్ని భారత్ సగౌరవంగా చెప్పకొవచ్చు. 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా ఓడిచింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది.


    పర్యటన మెుదలైనప్పటి నుంచి జట్టుకు అన్ని అటంకాలే.. కరోనా ప్రోటోకాల్,కీలక ఆటగాళ్లు గాయాలు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని భారత్ బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ముద్దాడింది.ఈ విజయంతో భారత్ క్రీడా అభిమానుల గుండె ఉప్పొంగింది. టీమిండియా సిరీస్ ఈ నెల పులకరించింది. క్రీడా దిగ్గజాలు భారత్ అసమాన పోరాటాన్ని కొనియాడారు. వీరు..వారు అనే కాదు ఆసీస్‌ ఆటగాళ్లు, కోచ్‌,ఆ దేశ అభిమానులు కూడా భారత్ విజయాన్ని అద్భుతమంటూ కీర్తించారు.
    Published by:Sridhar Reddy
    First published: