విశాఖ వన్డేలో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు.. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు పెవిలియన్ బాట పట్టారు.. వరుణుడి గ్యాప్‌తో అనుకున్న టైమ్‌కే మొదలైన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చెత్తగా ఆడారు.. 26ఓవర్లలో 117పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది.
స్టార్క్‌తో కష్టమే భయ్యా:
మిచెల్ స్టార్క్ మరోసారి దడ పుట్టించాడు. పదునైన బంతులతో నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్‌లోనే యంగ్ ఓపెనర్ గిల్‌ను అవుట్ చేసిన స్కార్ట్ తర్వాత వరుస పెట్టి వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్లలోనే మూడో బాల్‌కి గిల్ డకౌట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా పడిన బంతిని అనవసర షాట్ ఆడి గిల్ తన వికెట్ కోల్పోయాడు. ఔటైన వెంటనే గిల్ గట్టిగా అరుస్తూ మైదానాన్ని వీడాడు. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో కూడా గిల్ దాదాపు ఇదే రీతిలో అవుటయ్యాడు. అయితే మొదటి మ్యాచ్ తప్పిదాల నుంచి గిల్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ కూడా 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.
తొలి వన్డే హీరో కేఎల్ రాహుల్ తన పాత ఫామ్‌ను కంటీన్యూ చేశాడు. ఆదుకోవాల్సిన టైమ్‌లో హ్యాండ్ ఇచ్చాడు కేవలం 9 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత పాండ్యా కూడా ఒక పరుగుకే ఔటయ్యాడు. కాసేపు కోహ్లీ, ఆల్‌రౌండర్ జడేజా ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే 71 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 35 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 31 పరుగులు చేశాడు. ఇక 91 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అలెక్స్‌కు క్యాచ్ ఇచ్చి రవీంద్ర జడేజా ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ చాలా సేపు ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. కానీ అవతలి ఎండ్‌లో సహాకరం లేకపోవడంతో టీమిండియా 26ఓవర్లలో 117పరుగులకు ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్ 29బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఉదయం వరకు వాన.. అంతలోనే ఎండ
విశాఖ వెదర్‌ను అంచనా వేయడం చాలా కష్టం.. ఉదయం వరకు వాన దంచికొట్టింది. ఇక మ్యాచ్ జరగదులే అనుకున్నారంతా.. అయితే ఇంతలోనే ఎండ ఎంట్రీ ఇచ్చింది.. ఉదయం వరకు పిచ్‌పై ఉన్న కవర్స్‌ను తీసేశారు. విశాఖ గ్రౌండ్‌కు డ్రైనేజీ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉండడంతో మ్యాచ్ టైమ్‌కు అంతా సెట్ అయ్యింది. అయితే వరుణుడు సాయంత్రం మళ్లీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs australia