హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Aus: హమ్మయ్య వరుణుడు పోయాడు! టాస్‌ అయితే పడింది.. తుది జట్లు ఇవే!

Ind Vs Aus: హమ్మయ్య వరుణుడు పోయాడు! టాస్‌ అయితే పడింది.. తుది జట్లు ఇవే!

రోహిత్, స్టార్క్‌ (File)

రోహిత్, స్టార్క్‌ (File)

ఉదయం వరకు వాన దంచికొట్టింది. ఇక మ్యాచ్‌ జరగదులే అనుకున్నారంతా.. అయితే ఇంతలోనే ఎండ ఎంట్రీ ఇచ్చింది.. ఉదయం వరకు పిచ్‌పై ఉన్న కవర్స్‌ను తీసేశారు. విశాఖ గ్రౌండ్‌కు డ్రైనేజీ సిస్టమ్‌ కూడా అద్భుతంగా ఉండడంతో మ్యాచ్‌ టైమ్‌కు అంతా సెట్ అయ్యింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

అసలు మ్యాచ్‌ మొదలవుతుందా లేదా అన్న ఆలోచనలో ఉన్న క్రికెట్ అభిమానులకు కాస్త చల్లని వార్త తీసుకొచ్చాడు మండే సూర్యుడు. అనుకున్న టైమ్‌కే టాస్‌ పడింది.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో లేని కెప్టెన్‌ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.. అటు టీమిండియా యమ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ తిరిగి ఫామ్‌లోకి రావడం రోహిత్‌ సేనకు ప్లస్ కానుంది. బౌలింగ్‌లో షమీ, సిరాజ్‌ రెచ్చిపోయి బౌలింగ్‌ చేస్తుండడంతో ఆసీస్‌ బ్యాటర్లుకు ఈ మ్యాచ్‌లోనూ తిప్పలు తప్పేలా లేవు. ఇక ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది.. తొలి వన్డేలో గెలిచి ఇప్పటికీ సిరీస్‌పై పట్టు సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ పట్టేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచించింది.. అటు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది.. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపోటముల కంటే అసలు గేమ్‌ జరుగుతుందా లేదా అన్నదానిపైనే విపరీత చర్చ జరిగింది..

ఉదయం వరకు వాన.. అంతలోనే ఎండ

విశాఖ వెదర్‌ను అంచనా వేయడం చాలా కష్టం.. బట్టలు ఉతుకుదామని నానబెట్టినప్పుడు లేని వాన.. ఉతికే టైమ్‌లో విరుచుకుపడుతుంది.. అసలు ఎప్పుడు వాన పడుతుందో.. ఎప్పుడు ఉక్కపోస్తుందో తెలియని వాతావరణం విశాఖకే చెల్లింది. ఈ మ్యాచ్‌కు కూడా అంతే అయ్యింది.. ఉదయం వరకు వాన దంచికొట్టింది. ఇక మ్యాచ్‌ జరగదులే అనుకున్నారంతా.. అయితే ఇంతలోనే ఎండ ఎంట్రీ ఇచ్చింది.. ఉదయం వరకు పిచ్‌పై ఉన్న కవర్స్‌ను తీసేశారు. విశాఖ గ్రౌండ్‌కు డ్రైనేజీ సిస్టమ్‌ కూడా అద్భుతంగా ఉండడంతో మ్యాచ్‌ టైమ్‌కు అంతా సెట్ అయ్యింది. అయితే వరుణుడు సాయంత్రం మళ్లీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉందని సమాచారం. మ్యాచ్‌ మధ్యలో పలుమార్లు వాన పడే అవకాశాలున్నాయట.. దీంతో ఈ మ్యాచ్‌ మొత్తం జరుగుతుందా.. మధ్యలోనే ఆగిపోతుందా అన్నది ప్రస్తుతానికైతే చెప్పడం కష్టమే!

తుది జట్లు:

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

First published:

Tags: India vs australia, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు