Home /News /sports /

IND VS AUS UPPAL STADIUM HYDERABAD 3RD T20 MATCH TICKETS WILL BE AVAILABLE AT GYMKHANA GROUNDS TODAY SK

IND vs AUS: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఉప్పల్ టీ20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం నేడే.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IND vs AUS 2nd T20 Match: టికెట్ల వ్యవహారంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా స్పందించారు. టికెట్ల అమ్మకాల విషయంలో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చితే.. ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఉప్పల్‌లో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ (IND vs AUS 3rd t20 Match) టికెట్లు నేడు ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నారు. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌ (Gymkhana Grounds)లో ఉప్పల్ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వెల్లడించింది.  గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో టికెట్‌లను విక్రంచనున్నట్లు  తెలిపింది. హెచ్‌సీఏ నుంచి ఈ ప్రకటన రాగానే.. క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో జింఖానా గ్రౌండ్స్‌కి చేరుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే పడిగాపులు గాస్తున్నారు. ఒక్క టికెట్‌నైనా దక్కించుకోవాలని తీవ్రంగా పోటీ పడుతున్నారు. క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మోహరించారు. Telangana School Holidays: తెలంగాణలో దసరా సెలవులు తగ్గింపు.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ.. సెలవులు ఎన్ని రోజులంటే? వాస్తవానికి సెప్టెంబరు 15 నుంచే పేటీఎంలో ఉప్పల్ మ్యాచ్ (Uppal Cricket Match) టికెట్లను అందుబాటులో ఉంచారు. కానీ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే అన్నీ అయిపోయాయి. చాలా మందికి టికెట్లు దొరకలేదు. టికెట్స్ బుక్ అయిన వారికి కూడా ఆ తర్వాత క్యాన్సిల్ అయ్యాయి. టికెట్లు క్యాన్సిల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేంటని హెచ్‌సీఏ తీరుపై మండిపడ్డారు. పోనీ.. ఆఫ్‌లైన్‌లో అయినా కొందామంటే.. ఎక్కడా టికెట్లు విక్రయించలేదు. ఉప్పల్ స్టేడియానికి వెళ్తే.. జింఖానా గ్రౌండ్స్‌కి వెళ్లాలని చెబుతున్నారు. అక్కడికి వెళ్తే.. ఉప్పల్ స్టేడియంలోనే ఇస్తారని చెప్పారు. అటూ ఇటూ తిప్పారే తప్ప.. ఎక్కడ కూడా మ్యాచ్ టికెట్లు ఇవ్వలేదు. ఈ క్రమంలో హెచ్‌సీఏ వైఖరిపై అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 55వేలు. అయితే అందులో 20వేల టికెట్స్ కూడా అమ్మలేదని.. కానీ అప్పుడే హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్స్ అభిమానులకు ఇవ్వకుండా.. బ్లాక్‌లో దందా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే ఇవాళ ఒక్కరోజు జింఖానా గ్రౌండ్స్‌లో టికెట్లను విక్రయిస్తున్నారు. Aasara Pensions: ఇక వారికి కూడా ఆసరా పింఛన్​.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు! టికెట్ల వ్యవహారంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ (Srinivas Goud) కూడా స్పందించారు. టికెట్ల అమ్మకాల విషయంలో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చితే.. ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. టికెట్లను బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీతో కలిసి ఉప్పల్‌ స్టేడియాన్ని పరిశీలిస్తామని.. స్టేడియం సామర్థ్యం ఎంత? ఎన్ని టికెట్లు విక్రయించారనే దానిపై తేల్చుతామని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ . కాగా, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరగా 2019 డిసెంబర్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో భారత్ టీ20 తలపడింది. అప్పటి నుంచి మరో మ్యాచ్ జరగలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా నిర్వహించలేదు. ఐపీఎల్ 2020, 2021 సీజన్‌లు యూఏఈలో జరిగాయి. 2022 సీజన్ అహ్మదాబాద్, ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఉప్పల్‌లో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా తరలివస్తారన్న అంచనాలున్నాయి. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈనేపథ్యంలో అందుకు తగ్గట్లుగా పోలీసులు, అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Hyderabad, IND vs AUS, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు