IND vs AUS : కొత్త ఏడాదిలో వరుస సిరీస్ విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా (Team India)కు అసలైన ప్రత్యర్థి ఎదురు కానుంది. ఈ ఏడాది శ్రీలంక (Sri Lanka), న్యూజిలాండ్ (New Zealand) లాంటి జట్లపై భారత్ అలవోక విజయాలను అందుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు రోహిత్ శర్మ (Rohit sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) రెడీ అయ్యింది. భారత్ తో నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో ఎప్పుడో ల్యాండ్ అయ్యింది. బెంగళూరు వేదికగా టెస్టు సిరీస్ కోసం తీవ్రంగా చెమటోడుస్తోంది. ఈ ఏడాది జూన్ లో జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియా ఫైనల్ కు చేరాలంటే ఈ సిరీస్ చాలా కీలకం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ నెగ్గాల్సి ఉంది.
ఇక మరోవైపు ఈసారి జరగబోయే టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియా చాలా సీరియస్ గా తీసుకుంది. టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదల మీద ఉంది. అందుకు తగ్గట్లే తమ సన్నాహకాలను మొదలు పెట్టింది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుతో బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ కు తెరలేవనుంది. వచ్చే నెల మార్చి 22 వరకు ఆస్ట్రేలియా భారత్ లో పర్యటించనుంది.
షెడ్యూల్ ఇదే
ఎప్పుడు | మ్యాచ్ | వేదిక | సమయం |
ఫిబ్రవరి 9-13 | తొలి టెస్టు | నాగ్ పూర్ | ఉ.గం. 9.30లకు |
ఫిబ్రవరి 17-21 | రెండో టెస్టు | ఢిల్లీ | ఉ.గం.9.30లకు |
మార్చి 1-5 | మూడో టెస్టు | ధర్మశాల | ఉ.గం.9.30లకు |
మార్చి 9-13 | నాలుగో టెస్టు | అహ్మదాబాద్ | ఉ.గం.9.30లకు |
మార్చి 17 | తొలి వన్డే | వాంఖడే | మ.గం.1.30లకు |
మార్చి 19 | రెండో వన్డే | వైజాగ్ | మ.గం.1.30లకు |
మార్చి 22 | మూడో వన్డే | చెన్నై | మ.గం.1.30లకు |
టెస్టు సిరీస్ ను భారత్ భారీ తేడాతో నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా నంబర్ వన్ కు చేరుకోవడం ఖాయం. ఇక ఈ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. డీడీ స్పోర్ట్స్ కూడా ప్రసారం చేయనున్నాయి.
జట్లు
టీమిండియా (తొలి రెండు టెస్టుల కోసం)
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీ, పుజారా, ఉనాద్కట్, సూర్యకుమార్ యాదవ్, ఉమేశ్ యాదవ్
ఆస్ట్రేలియా
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), అగర్, బొలాండ్, అలెక్స్ క్యారీ, గ్రీన్, హ్యాండ్స్ కాబ్, హేజల్ వుడ్, స్టార్క్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, మోరిస్, మర్ఫీ, స్వెప్సన్, డేవిడ్ వార్నర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, IND vs AUS, India vs australia, KL Rahul, Pat cummins, Rohit sharma, Shubman Gill, Steve smith, Virat kohli