Ind vs Aus : అడిలైడ్ టెస్ట్ పై కరోనా ఎఫెక్ట్.. వారు మధ్యలోనే ఇంటికి..!

INDIA VS AUSTRALIA

Ind vs Aus : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌పై కరోనా ప్రభావం పడింది. ఆసీస్ ప్రధాన నగరం అయిన సిడ్నీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో..టెస్ట్ సిరీస్‌కి కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లలో కొంత మందిని ఇంటికి పంపారు.

  • Share this:
    భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌పై కరోనా ప్రభావం పడింది. ఆసీస్ ప్రధాన నగరం అయిన సిడ్నీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో..టెస్ట్ సిరీస్‌కి కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లలో కొంత మందిని ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లిన వారిలో ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌ లీ కూడా ఉన్నాడు. గురువారం డే/నైట్ టెస్టులో లీ కామెంటరీ చెప్పగా.. ఈరోజు మాత్రం విధులకు హాజరుకాలేదు.టెస్ట్ సిరీస్‌ని ప్రసారం చేస్తున్న ఫాక్స్ స్పోర్ట్స్, ఛానెల్ 7 కూడా తమ స్టాఫ్‌లో కొంత మందిని ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ఆదేశించింది. సిడ్నీలోని నార్తర్న్ బీచ్స్ ప్రాంతంలో శుక్రవారం 28 కరోనా కేసులు నమోదవడంతో ఛానల్ 7 మరియు ఫాక్స్ స్పోర్ట్స్ రెండూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. తమ సిబ్బందిని వైరస్ టెస్ట్ కోసం ఆసుపత్రికి పంపించాయి.

    డే/నైట్ టెస్టు రెండవ రోజు మొదటి బంతికి ముందు పరీక్షల కోసం పంపిన వారిలో కెమెరామెన్ మరియు ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు.సెవెన్ రేడియో యాజయాన్యం బ్రాడ్ హాడిన్, గావిన్ రాబర్ట్‌సన్ మరియు మాట్ వైట్లను సిడ్నీకి తిరిగి పంపించింది. వీరందరూ మిగిలిన నాలుగు రోజులు స్టూడియో నుంచి వ్యాఖ్యానం చేయనున్నారు. డే/నైట్ టెస్టు అడిలైడ్‌ వేదికగా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి 11 వరకూ జరగాల్సిన మూడో టెస్టుపై సందేహాలు నెలకొన్నాయి.



    ఆస్ట్రేలియా గడ్డపై ఈ సిరీస్ బయో- సెక్యూర్ వాతావరణంలో జరుగుతుండగా.. రెండు జట్ల క్రికెటర్లతో పాటు కోచ్‌లు, సహాయ సిబ్బంది క్వారంటైన్‌లో ఉండి కరోనా వైరస్ పరీక్షల అనంతరం ఈ బబుల్‌లోకి వచ్చారు. కానీ.. మ్యాచ్ కామెంటేటర్లు, ఛానల్ స్టాఫ్ ఈ బబుల్‌లో లేరు. దాంతో.. మ్యాచ్‌ గ్యాప్‌లో వారు ఇంటికి వెళ్లి మళ్లీ విధులకి వస్తున్నారు. ఈ క్రమంలో బ్రెట్ లీ కూడా ఇటీవల సిడ్నీ నుంచి రాగా.. ఛానల్ స్టాఫ్ కూడా అలానే వచ్చారు. దాంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

    వాస్తవానికి కామెంటేటర్‌గా ఉన్న బ్రెట్‌ లీని క్వారంటైన్‌లో ఉండి.. విధులకి హాజరయ్యే వెసులబాటుని కల్పించారు. కానీ.. త్వరలోనే క్రిస్మస్ రాబోతుండటంతో.. ఫ్యామిలీతో సమయం గడపాలని కాంక్షించిన బ్రెట్ లీ తాను సిరీస్‌లో కామెంటేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సిడ్నీలో కరోనా పాజిటివ్ కేసులు గత కొద్దిరోజుల నుంచి గణనీయంగా పెరుగుతుండటంతో.. సిడ్నీ సరిహద్దులు మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
    Published by:Sridhar Reddy
    First published: