హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS T20 Series : బుమ్రా యార్కర్ అంటే ఇలానే ఉంటది.. ఒకరేమో మన్ను బొక్కితే.. మరొకరేమో క్లీన్ బౌల్డ్ (వీడియో)

IND vs AUS T20 Series : బుమ్రా యార్కర్ అంటే ఇలానే ఉంటది.. ఒకరేమో మన్ను బొక్కితే.. మరొకరేమో క్లీన్ బౌల్డ్ (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS T20 Series : టీమిండియా (Team India) స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బు మ్రా (Jasprit Bumrah) అదిరిపోయే పునరాగమనం చేశాడు. గాయంత కారణంగా ఆసియా కప్ (Asia cup) 2022కి దూరమైన అతడు.. ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండో టి20 ద్వారా మళ్లీ క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS T20 Series : టీమిండియా (Team India) స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బు మ్రా (Jasprit Bumrah) అదిరిపోయే పునరాగమనం చేశాడు. గాయంత కారణంగా ఆసియా కప్ (Asia cup) 2022కి దూరమైన అతడు.. ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండో టి20 ద్వారా మళ్లీ క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు. రెండు ఓవర్లే వేసినా తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కుల చూపించాడు. పరుగులు ఎక్కువే ఇచ్చినా.. కీలకమైన ఫించ్ వికెట్ ను తీసి ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా తన వంతు సాయం చేశాడు. ఇక మ్యాచ్ లో బుమ్రా యార్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్నా అద్భుతమైన నియంత్రణతో బౌలింగ్ చేశాడు.

ఇది కూడా చదవండి : అభిమానులతో కంటతడి పెట్టించిన ఫెడరర్.. ఆఖరికి చిరకాల ప్రత్యర్థి కూడా ఏడ్చేశాడు..

ఈ క్రమంలో ఆరోన్ ఫించ్ ను 5వ ఓవర్  ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. బుల్లెట్ లో లొపలికి దసుకొచ్చిన యార్కర్ ను ఎడా ఆడాలో తెలియన ఫించ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరికి ఫించ్ కూడా బుమ్రా యార్కర్ ను మెచ్చుకోలేక ఉండలేకపోయాడు. చప్పట్లు కొడుతూ అభినందిస్తూ పెవిలియన్ కు చేరాడు. ఇక తన తర్వాతి ఓవర్లో మరో యార్కర్ తో స్టీవ్ స్మిత్ ను కింద పడేలా చేశాడు. టి20 ప్రపంచకప్ ముందు భారత్ మరో నాలుగు టి20 మ్యాచ్ లతో పాటు రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడనుండటంతో బుమ్రా పూర్తి స్వింగ్ లోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో భారత్ ను వేధిస్తోన్న డెత్ ఓవర్ల సమస్య తీరిపోనుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే సిరీస్ లో నిలవాలంటే తప్పుకుండా గెలవాల్సిన పోరుల ోభారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 91 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇక చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా..అప్పుడే క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (2 బంతుల్లో 10 నాటౌట్; 1 సిక్స్, ఒక ఫోర్) వరుసగా 6, 4 కొట్టి మ్యాచ్ ను ముగించేశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, Rohit sharma, Steve smith, Team India

ఉత్తమ కథలు