Home /News /sports /

IND VS AUS T20 SERIES THESE 5 REASONS WHY INDIA LOST 1ST T20 AGAINST AUSTRALIA SJN

IND vs AUS 1st T20 : తొలి టి20లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే.. ముఖ్యంగా ఆ రెండు విషయాలు..

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 1st T20 : ఆస్ట్రేలియా (Australia)తో టి20 సిరీస్ ను భారత్ (India) ఓటమితో ఆరంభించింది. మొహాలీ (Mohali) వేదికగా జరిగిన తొలి టి20లో టీమిండియా (Team India)పై నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా (Australia) ఘనవిజయం సాధించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs AUS 1st T20 : ఆస్ట్రేలియా (Australia)తో టి20 సిరీస్ ను భారత్ (India) ఓటమితో ఆరంభించింది. మొహాలీ (Mohali) వేదికగా జరిగిన తొలి టి20లో టీమిండియా (Team India)పై నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా (Australia) ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (71 నాటౌట్), కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46) రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. గ్రీన్ (61), మ్యాథ్యూ వేడ్ (45 నాటౌట్), స్టీవ్ స్మిత్ (35) జట్టును గెలిపించారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డెత్ బౌలింగ్ : ఆసియా కప్ నుంచి కూడా భారత్ ను డెత్ బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో కూడా భారత్ ఓటమికి ఇదే ప్రధాన కారణంగా నిలిచింది. ఛేదనలో ఆస్ట్రేలియా 16 ఓవర్లు ముగిసే సరికి విజయానికి చాలా దూరంలో ఉంటుంది. ఆసీస్ గెలవాలంటే చివరి నాలుగు ఓవర్లలో 55 పరుగులు చేయాలి. క్రీజులో వేడ్, టిమ్ డేవిడ్ మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకర్ని అవుట్ చేసిన భారత్ విజయం ఖాయం అయ్యేలా కనిపించింది. అయితే భారత్ ను డెత్ బౌలింగ్ మరోసారి దెబ్బ తీసింది. 17వ ఓవర్ వేసిన భువనేశ్వర్ 15 పరుగులు సమర్పించుకున్నాడు. 18వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ మూడు సిక్సర్లతో 22 పరుగులు ఇచ్చాడు. మళ్లీ 19వ ఓవర్ వేయడానికి వచ్చి భువీ 16 పరుగులు ఇచ్చాడు. ఇలా కేవలం 20 బంతుల్లోనే భారత్ 57 పరుగులు సమర్పించుకుని విజయాన్ని దూరం చేసుకుంది. చెత్త ఫీల్డింగ్  : ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఏకంగా మూడు క్యాచ్ లను జారవిడచడంతో పాటు బంతిని ఆపడంలో కూడా తడబడ్డారు. హర్షల్ పటేల్ సిక్సర్ ను మ్యాక్స్ వెల్ అద్భుతంగా ఆపి 5 పరుగులు సేవ్ చేస్తే.. మన ప్లేయర్లు మాత్రం ఈజీ క్యాచ్ లను నేలపాలు చేస్తారు. కెప్టెన్సీ  : ఇక మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా టీం సెలెక్షన్. ఉమేశ్ యాదవ్ టి20 ప్రపంచకప్ జట్టులో లేడు. అలాంటప్పుడు అతడికి తుది జట్టులో చోటు ఇవ్వడం అర్థం కాలేదు. స్టాండ్ బై గా ఉన్న దీపక్ చహర్ కు చాన్స్ ఇవ్వొచ్చు. కానీ, భారత్ అలా చేయలేదు. ఇక మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ తన తొలి ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు ఇచ్చి 24 పరుగులు ఇస్తాడు. దాంతో ఉమేశ్ ను పక్కన బెడతాడు రోహిత్. అయితే 12వ ఓవర్ తీసుకువస్తాడు. తొలి రెండు బంతులకు వరుసగా 6, 4 సమర్పించుకన్నా ఆ తర్వాత కీలకమైన స్మిత్, మ్యాక్స్ వెల్ లను అవుట్ చేస్తాడు. దాంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గుతుంది. అయితే మరో 2 ఓవర్లు ఉన్నా ఉమేశ్ తో మళ్లీ బౌలింగ్ చేయించడు. వికెట్లు తీస్తున్న సమయంలో అతడికి వెంటనే మరో ఓవర్ ఇచ్చి ఉంటే భారత్ కు వికెట్లు దక్కేవేమో. కానీ, రోహిత్ మాత్రం అలా చేయడు. వేడ్, గ్రీన్  : ఇక మ్యాచ్ లో కెమరూన్ గ్రీన్, మ్యాథ్యూ వేడ్ లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లతో చెలరేగారు. గ్రీన్ భారీ షాట్లతో ఆస్ట్రేలియాకు సూపర్ ఆరంభాన్ని ఇస్తే.. వేడ్ చివర్లో అదిరిపోయే ఫినిష్ ఇస్తాడు. వీరిద్దరు తమ బ్యాటింగ్ తో భారత్ విజయాన్ని దూరం చేశారు. టాస్  :  టాస్ విషయంలో రోహిత్ శర్మ అన్ లక్కీ గా ఉన్నాడు. టి20 ఫార్మాట్ లో రోహిత్ కు టాస్ ఓడిపోవడం వరుసగా ఇది 5వది. మొహాలీ పిచ్ బ్యాటింగ్ వికెట్ కావడం.. అదే సమయంలో డ్యూ ఫ్యాక్టర్ ఉండటంతో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాస్ ఓడిపోవడం భారత్ విజయావకాశాలను దెబ్బ తీసింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Pat cummins, Rohit sharma, Steve smith, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు