హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs PAK : మరోసారి బౌలౌట్ లో తలపడ్డ భారత్, పాకిస్తాన్.. అయితే ఈసారి రిజల్ట్ ఎలా ఉందంటే?

IND vs PAK : మరోసారి బౌలౌట్ లో తలపడ్డ భారత్, పాకిస్తాన్.. అయితే ఈసారి రిజల్ట్ ఎలా ఉందంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs PAK : 2007లో జరిగిన టి20 ప్రపంచకప్ (T20 World cup)ను టీమిండియా (Team India) అభిమానులు ఎన్నటికీ మరిచిపోరు. ఎటువంటి అంచనాలు లేకుండా సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), జహీర్ ఖాన్ (Zaheer Khan)లాంటి సీనియర్లు లేకపోయినా

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs PAK : 2007లో జరిగిన టి20 ప్రపంచకప్ (T20 World cup)ను టీమిండియా (Team India) అభిమానులు ఎన్నటికీ మరిచిపోరు. ఎటువంటి అంచనాలు లేకుండా సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), జహీర్ ఖాన్ (Zaheer Khan)లాంటి సీనియర్లు లేకపోయినా.. యువ జట్టుతో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్లో పాకిస్తాన్ (Pakistan) విజయం సాధించడం మరింత ఆనందాన్నిఇచ్చింది. ఆ టోర్నీలో భారత్, పాక్ లు రెండు సార్లు తలపడతాయి. మొదట గ్రూప్ మ్యాచ్ లో.. ఆ తర్వాత మళ్లీ ఫైనల్లో. ఈ రెండు సార్లు కూడా టీమిండియాదే విజయం. గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన పోరు టై కావడంతో విజేతను తేల్చేందుకు బౌలౌట్ ను నిర్వహిస్తారు.

అందులో భారత్ 3-0తో పాకిస్తాన్ పై విజయం సాధిస్తుంది. భారత్ తరఫున సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఉతప్పలు వికెట్లను గిరాటేస్తే.. పాకిస్తాన్ తరఫున యాసిర అరాఫత్, ఉమర్ గుల్, అఫ్రిదిలు ఆ పని చేయలేకపోతారు. మరో రెండు బంతులు వేయాల్సి ఉండగానే భారత్ విజయం సాధిస్తుంది. ఇక 2007 ఫ్లాష్ బ్యాక్ అంటూ 15 ఏళ్ల తర్వాత మరోసారి భారత్, పాకిస్తాన్ ప్లేయర్లు బౌల్ అవుట్ ఆడారు. అయితే ఇందులో మాజీ ప్లేయర్లు పాల్గొనడం విశేషం.

భారత్ తరఫున సునీల్ గావస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, శివరామకృష్ణన్ బరిలోకి దిగగా.. పాకిస్తాన్ నుంచి రమీజ్ రాజా, అమీర్ సోహైల్, షోయబ్ అక్తర్ పోటీ పడ్డారు. తొలుత రమీజ్ రాజా వేయగా.. అది వికెట్లను మిస్ చేసింది. బౌలింగ్ కు వచ్చిన సునీల్ గావస్కర్ వికెట్లను గిరాటేసి భారత్ కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత అమీర్ సోహైల్ కూడా మిస్ చేశాడు. అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం ఎటువంటి తప్పు చేయకుండా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక మూడో బౌలర్ గా షోయబ్ అక్తర్ రాగా అతడు కూడా వికెట్లను మిస్ చేశాడు. భారత్ తరఫున బౌలింగ్ కు వచ్చిన లెజండరీ లెగ్ స్పిన్నర్ శివరామకృష్ణన్ ఫ్లయిటెడ్ డెలివరీతో వికెట్లను గిరాటేసి మరోసారి భారత్ కు బౌలౌట్ లో విజయాన్ని ఖాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Harbhajan singh, India vs australia, India VS Pakistan, MS Dhoni, Rohit sharma, Team India, Virat kohli, Virender Sehwag, VVS Laxman

ఉత్తమ కథలు