హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS : HRCకి చేరిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హైదరాబాద్ మ్యాచ్ టికెట్ల లొల్లి.. ఇంతకీ ఏం జరిగిందంటే?

IND vs AUS : HRCకి చేరిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హైదరాబాద్ మ్యాచ్ టికెట్ల లొల్లి.. ఇంతకీ ఏం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు టీమిండియా (Team India) ఆస్ట్రేలియా (Australia)తో కీలకమైన టి20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు ఈ నెల 20, 23, 25వ తేదీల్లో జరగనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు టీమిండియా (Team India) ఆస్ట్రేలియా (Australia)తో కీలకమైన టి20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు ఈ నెల 20, 23, 25వ తేదీల్లో జరగనున్నాయి. చివరిదైన మూడో టి20 హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఈ నెల 15న హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (HCA) ప్రముఖ వెబ్ సైట్, యాప్ పేటియం (Paytm)ద్వారా విడుదల చేసింది. అయితే ఈ టికెట్లను కొనుగోలు చేసే సమయంలో అభిమానులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లను అమ్మకానికి ఉంచినా.. సర్వర్స్ మొరాయించడం వల్ల 10 గంటలకు బుక్ చేసుకునే వీలు దొరికింది. అప్పటికీ టికెట్స్ ను బుక్ చేసుకుందామని అభిమానులు ప్రయత్నించగా.. టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయని చూసి షాక్ తిన్నారు.

తాజాగా దీనిపై అడ్వకేట్ సలీం HRCని ఆశ్రయించారు. ఉప్పల్ వేదికగా ఈ నెల 25న జరిగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని సలీం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రీడాభిమానులను మోసం చేస్తూ అక్రమంగా టికెట్లను బ్లాక్ లో HCA విక్రయిస్తుందని ఆయన ఆరోపణలు కూాడా చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

టికెట్ల విషయంలో గందరగోళం

ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55 వేలు కాగా.. 38 వేల టికెట్లను అమ్మకాల కోసం ఉంచారు. మిగిలిన టికెట్లను స్పాన్సర్లకు, ప్లేయర్లకు కేటాయించారు. అయితే టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడం అభిమానులకు మింగుడు పడనీయకుండా ఉంది.  అదే సమయంలో రూ. 850 నుంచి రూ. 10,000ల వరకు టికెట్లను విక్రయించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి టికెట్లను సెప్టెంబర్ 15 ఉదయం 11 గంటలకు పేటియం యాప్ ద్వారా విక్రయానికి ఉంచుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. అయితే కాసేపటికే ఉదయం కాదు రాత్రి 8 గంటల నుంచి విక్రయిస్తామని మాట మార్చింది. ఇక రాత్రి 8 గంటలకు యాప్ ఓపెన్ చేసి టికెట్ల కోసం సెర్చ్ చేస్తే వివరాలు కనిపించలేదు. 2 గంటలు ఆలస్యంగా రాత్రి 10 గంటలకు లింక్ అందుబాటులోకి వచ్చింది. తీరా ఓపెన్ చేస్తే అప్పటికే టికెట్లు అమ్ముడైనట్లు చూపడంతో అభిమానులు షాక్ తిన్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Azaharuddin, Hardik Pandya, Hyderabad, India vs australia, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు