హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ పై హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.! కారణం ఇదేనా?

IND vs AUS : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ పై హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం.! కారణం ఇదేనా?

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS T20 Series : టి20 ప్రపంచకప్ (T20 Wolrd Cup) ముంగిట భారత్ (India) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో టీమిండియా (Team India) మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 20 నుంచి 25 మధ్య ఈ మూడు మ్యాచ్ లు జరుగుతాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS T20 Series : టి20 ప్రపంచకప్ (T20 Wolrd Cup) ముంగిట భారత్ (India) వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో టీమిండియా (Team India) మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 20 నుంచి 25 మధ్య ఈ మూడు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి టి20 20న మొహాలి వేదికగా జరుగుతుంటే.. రెండో టి20 23న నాగ్ పూర్ వేదికగా జరగనుంది. ఇక చివరిదైన మూడో టి20 25న హైదరాబాద్ వేదికగా జరగనుంది. దాంతో హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను సెప్టెంబర్ 15న ఆన్ లైన్ ద్వారా విక్రయించారు.

ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55 వేలు కాగా.. 38 వేల టికెట్లను అమ్మకాల కోసం ఉంచారు. మిగిలిన టికెట్లను స్పాన్సర్లకు, ప్లేయర్లకు కేటాయించనున్నారు. అయితే టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడం అభిమానులకు మింగుడు పడనీయకుండా ఉంది.  అదే సమయంలో రూ. 850 నుంచి రూ. 10,000ల వరకు టికెట్లను విక్రయించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి టికెట్లను సెప్టెంబర్ 15 ఉదయం 11 గంటలకు పేటియం యాప్ ద్వారా విక్రయానికి ఉంచుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. అయితే కాసేపటికే ఉదయం కాదు రాత్రి 8 గంటల నుంచి విక్రయిస్తామని మాట మార్చింది. ఇక రాత్రి 8 గంటలకు యాప్ ఓపెన్ చేసి టికెట్ల కోసం సెర్చ్ చేస్తే వివరాలు కనిపించలేదు. 2 గంటలు ఆలస్యంగా రాత్రి 10 గంటలకు లింక్ అందుబాటులోకి వచ్చింది. తీరా ఓపెన్ చేస్తే అప్పటికే టికెట్లు అమ్ముడైనట్లు చూపడంతో అభిమానులు షాక్ తిన్నారు. ఏదో కిరికిరి జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారు.

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, షమీ, బుమ్రా, చహల్, దీపక్ చహర్

ఆస్ట్రేలియా

ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మ్యాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలీస్, కామెరూన్ గ్రీన్, మ్యాక్స్ వెల్, జోస్ హాజల్ వుడ్, ఇంగ్లిస్, రిచర్డ్ సన్, సామ్స్, ఆడం జంపా.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, David Warner, Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, Hyderabad, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Mohammed Shami, Pat cummins, Paytm, Rishabh Pant, Rohit sharma, Steve smith, Virat kohli

ఉత్తమ కథలు