హోమ్ /వార్తలు /క్రీడలు /

Mahesh Babu : మహేశ్ బాబును టార్గెట్ చేసిన డేవిడ్ వార్నర్.. ఖలేజా వీడియోతో..

Mahesh Babu : మహేశ్ బాబును టార్గెట్ చేసిన డేవిడ్ వార్నర్.. ఖలేజా వీడియోతో..

PC : TWITTER

PC : TWITTER

Mahesh Babu - David Warner : ఆస్ట్రేలియా (Australia) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) అటు ఆటతోనే కాదు ఇటు రీల్స్ తోనూ సూపర్ పాపులర్ అవుతున్నాడు. మొన్నటి వరకు క్రికెట్ (Cricket)తోనే సావాసం చేసిన వార్నర్.. 2020 నుంచి తెలుగు సినిమాలంటే పడి చచ్చిపోతున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Mahesh Babu - David Warner : ఆస్ట్రేలియా (Australia) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) అటు ఆటతోనే కాదు ఇటు రీల్స్ తోనూ సూపర్ పాపులర్ అవుతున్నాడు. మొన్నటి వరకు క్రికెట్ (Cricket)తోనే సావాసం చేసిన వార్నర్.. 2020 నుంచి తెలుగు సినిమాలంటే పడి చచ్చిపోతున్నాడు. అల.. వైకుంఠపురంలో సినిమాతో స్టార్ట్ చేసిన వార్నర్.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన డైలాగ్స్, డ్యాన్స్ లతో ఇండియాలో సూపర్ పాపులారిటీని సాధించుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ తో బ్యాడ్ బాయ్ గా మారిపోయిన అతడు తెలుగు సినిమాలతో గుడ్ బాయ్ ట్యాగ్ ను అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో పెద్దగా తెలుగు సినిమాలపై వీడియోలు చేయని వార్నర్.. తాజాాగా మహేశ్ బాబు (Mahesh Babu) మూవీ ఖలేజాతో వచ్చేశాడు.

2010లో రిలీజ్ అయిన ఖలేజా సినిమాకు సంబంధించిన ఒక చిన్న వీడియోను చేసి ఇన్ స్టాగ్రామ్ లో వార్నర్ వదిలాడు. మహేశ్ బాబు ఫేస్ ను తన ఫేస్ తో మార్ఫింగ్ చేసిన వార్నర్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో హల్చల్ చేస్తున్నాడు. ఈ వీడియోను చూసిన పలువురు అభిమానులు డేవిడ్ బాబు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరీ..

ఇటీవెల వార్నర్ భారతీయులందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాడు కూడా. ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ జట్టులో వార్నర్ చోటు దక్కించుకున్నాడు. అయితే అంతకంటే ముందు ఇండియాతో జరిగే టి20 సిరీస్ కు మాత్రం సెలెక్ట్ కాలేదు. మెగా ఈవెంట్ కు ముందు వార్నర్ కు విశ్రాంతి ఇవ్వడానికే క్రికెట్ ఆస్ట్రేలియా మొగ్గు చూపింది. దాంతో అతడు ఇండియాకు రావడం లేదు.

ఇక భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టి20 సిరీస్ ఈ నెల 20 నుంచి ఆరంభం కానుంది. తొలి టి20 మొహాలి వేదికగా 20న.. రెండో టి20 నాగ్ పూర్ వేదికగా 23న.. చివరిదైన మూడో టి20 25న హైదరాబాద్ వేదిగా జరుగుతుంది. ఈ సిరీస్ కోసం భారత్, ఆస్ట్రేలియాలు ఇప్పటికే తమ జట్లను కూడా ప్రకటించాయి.

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, షమీ, బుమ్రా, చహల్, దీపక్ చహర్

ఆస్ట్రేలియా

ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మ్యాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలీస్, కామెరూన్ గ్రీన్, మ్యాక్స్ వెల్, జోస్ హాజల్ వుడ్, ఇంగ్లిస్, రిచర్డ్ సన్, సామ్స్, ఆడం జంపా.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: David Warner, Dinesh Karthik, Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Khaleja, Mahesh Babu, Pat cummins, Rohit sharma, Steve smith, Telugu movies, Tollywood, Virat kohli

ఉత్తమ కథలు