హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs AUS : పోలా.. అదిరిపోలా.. టీమిండియా కొత్త జెర్సీ అదరహో.. టి20 ప్రపంచకప్ కోసం కొత్త కిట్

IND vs AUS : పోలా.. అదిరిపోలా.. టీమిండియా కొత్త జెర్సీ అదరహో.. టి20 ప్రపంచకప్ కోసం కొత్త కిట్

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS 1st T20: టీమిండియా (Team India) కొత్త జెర్సీ తళుక్కుమంది. టి20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం రూపొందించిన కొత్త జెర్సీలో టీమిండియా (Team India) ప్లేయర్లు మెరిసిపోతున్నారు. ఈ కిట్ ను బీసీసీఐ (BCCI) విడుదల చేయగా.. జెర్సీని చూసిన భారత అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs AUS 1st T20: టీమిండియా (Team India) కొత్త జెర్సీ తళుక్కుమంది. టి20 ప్రపంచకప్ (T20 World Cup) కోసం రూపొందించిన కొత్త జెర్సీలో టీమిండియా (Team India) ప్లేయర్లు మెరిసిపోతున్నారు. ఈ కిట్ ను బీసీసీఐ (BCCI) విడుదల చేయగా.. జెర్సీని చూసిన భారత అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ జెర్సీ వేసుకున్న రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, హర్మన్ ప్రీత్ కౌర్, రేణుకా సింగ్, షఫాలీ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లతో కూడిన పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో బీసీసీఐ పోస్ట్ చేసింది. ఈ జెర్సీని చూసిన భారత అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జెర్సీని నైకీ కాకుండా MPL డిజైన్ చేసింది. నైకీతో కాంట్రాక్ట్ ముగియడంతో ప్రస్తుతం MPL టీమిండియా కిట్ స్పాన్సర్ గా ఉంది.

జెర్సీ విషయానికి వస్తే ఇందులో రెండు కలర్స్ ను వాడారు. షోల్డర్స్ దగ్గర ముదురు నీలం కలర్ ను.. మిగతా భాగంలో లైట్ బ్లూను వాడారు. మధ్యలో కొన్ని గీతలు కూడా ఉన్నాయి. ఈ జెర్సీ 2007 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కిట్ కు దగ్గరగా ఉంది. తొలి టి20 ప్రపంచకప్ లో విజయం సాధించిన తర్వాత టీమిండియా మళ్లీ ఈ ఫార్మాట్ లో ప్రపంచ చాంపియన్ గా నిలువలేదు. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

ఇక టి20 ప్రపంచకప్ ముందు భారత్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్ లను ఆడనుంది. ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆరంభం కానుంది. మొహాలీ వేదికగా మంగళవారం జరిగే తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టి20 ప్రపంచకప్ జట్టును ప్రకటించడం.. దాదాపుగా అదే జట్టుతో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుండటంతో కూర్పుపై ఒక స్పష్టతకు వచ్చేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ కొత్త జెర్సీతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమచారం. తొలి టి20 అనంతరం 23న నాగ్ పూర్ లో రెండో టి20, 25న హైదరాబాద్ లో మూడో టి20 జరగనున్నాయి. అనంతరం సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Glenn Maxwell, Hardik Pandya, India vs australia, Jasprit Bumrah, KL Rahul, Mohammed Shami, Pat cummins, Rishabh Pant, Rohit sharma, Steve smith, T20 World Cup 2022, Team India, Virat kohli

ఉత్తమ కథలు