Ind vs Aus 2020 : భవిష్యత్తులో బుమ్రా గొప్పలు చెప్పుకుంటాడు.. సన్నీ ఆసక్తికర కామెంట్లు

jasprit bumrah (image credit :BCCI Twitter)

Ind vs Aus 2020 : అడిలైడ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యం సంపాందించింది. భారత బౌలర్లు అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 53 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా ఓపెనర్ పృథ్వీషా నిరాశపరిచాడు. దీంతో ఆఖర్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నైట్ వాచ్ మెన్ గా రావడంపై దిగ్గజ ప్లేయర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Share this:
    అడిలైడ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యం సంపాందించింది. భారత బౌలర్లు అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 53 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా ఓపెనర్ పృథ్వీషా నిరాశపరిచాడు. దీంతో ఆఖర్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నైట్ వాచ్ మెన్ గా రావడంపై దిగ్గజ ప్లేయర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘40-50 ఏళ్ల తర్వాత బుమ్రా తన మనవళ్లు, మనవరాళ్లతో మాట్లాడుతూ.. అతడు టీమ్ఇండియాకు మూడో స్థానంలో ఆడానని చెప్పుకుంటాడని, అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఇలా బ్యాటింగ్‌ చేశాడనేది మాత్రం చెప్పడని పేర్కొన్నాడు. అడిలైడ్‌లో జరుగుతోన్న పింక్‌బాల్‌ టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం లభించింది.

    ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించగా ఓపెనర్‌ పృథ్వీషా(4) మరోసారి నిరాశపరిచాడు. జట్టు స్కోర్‌ 7 పరుగుల వద్దే కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నైట్‌వాచ్‌మెన్‌గా బుమ్రాను పంపించడంతో అంతా అవాక్కయ్యారు. టీమ్‌ఇండియా పేసర్‌ ఆసీస్‌ బౌలర్లను కాచుకుంటాడా అని సందేహించారు. ఈ క్రమంలోనే సన్నీ.. ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు.

    Ind vs Aus , India vs Australia 2020, adelaide test, first test, adelaide test news, Pink ball, pink test, sunil gavaskar, gavaskar, fielding, prithvi shaw, భారత్-ఆస్ట్రేలియా, టీమిండియా ఫీల్డింగ్, క్యాచ్ లు , సునీల్ గవాస్కర్, సన్నీ
    sunil gavaskar


    అయితే, బుమ్రా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెలివిగా ఆడాడు. ఆట పూర్తయ్యేవరకు ఒక్క పరుగూ చేయకుండా వికెట్‌ కాపాడుకున్నాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 9/1తో నిలిచింది. అతడికి మయాంక్‌ అగర్వాల్‌(5) తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ 62 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో రోజు నిలకడగా ఆడితే తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించడం కష్టమేమీకాదు.
    Published by:Sridhar Reddy
    First published: