IND VS AUS ROHIT SHARMA GETS WARM WELCOME AS HE JOINS SQUAD IN MELBOURNE SRD
Rohit Sharma: రోహిత్ శర్మ వచ్చిన సంతోషంలో టీమిండియా ఆటగాళ్లు ఏం చేశారంటే.. వీడియో వైరల్
Rohit Sharma
Rohit Sharma: ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ తిరిగి టీమ్ తో కలిశాడు. హిట్ మ్యాన్ రాకతో టీమిండియా జట్టు సభ్యుల్లో సంతోషం కన్పించింది.
ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ తిరిగి టీమ్ తో కలిశాడు. హిట్ మ్యాన్ రాకతో టీమిండియా జట్టు సభ్యుల్లో సంతోషం కన్పించింది. చప్పట్లు కొట్టి రోహిత్ ని ఆహ్వానించారు. కొందరు ఆటగాళ్లు రోహిత్ ను హగ్ చేసుకుని మరి వెల్ కమ్ చెప్పారు. ఈ వీడియో బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు రోహిత్ వచ్చేశాడు... ఆస్ట్రేలియా కాస్కో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మూడో టెస్టులో రోహిత్ ఆడతాడని ఇప్పటికే టీమిండియా కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇప్పుడు రోహిత్ సిడ్నీలో అడుగు పెట్టడంతో మూడో టెస్ట్ లో రోహిత్ ఆడటం కన్ఫామ్ గా కనిపిస్తుంది. మరో వైపు భారత్ చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా తమ లోపాల్ని సరిదిద్దుకునే పనిలో పడింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన ఓపెనర్ జో బర్న్స్‌ను జట్టు నుంచి తొలగించింది.
మెల్ బోర్న్ డే టెస్ట్ విక్టరీతో సిరీస్ లోకి టీమిండియా మళ్లీ దూసుకొచ్చింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది భారత్. అయితే, క్వారంటైన్ ను ముగించుకుని స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరాడు. అయితే, ఇక్కడే అసలు తలనొప్పి మొదలైంది. స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ కోసం జట్టులో ఎవరిపై వేటు వేయాలన్న తర్జన భర్జనలో ఉంది టీమ్ మేనేజ్ మెంట్.టెస్టుల్లో గొప్ప రికార్డులేమి లేని రోహిత్.. గతేడాది స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓపెనర్ అవతారమెత్తాడు. శతకాలు సాధించి అన్ని ఫార్మాట్లలో సత్తాచాటగలనని చాటిచెప్పాడు. అయితే అతడు ఇంత వరకు అసలు పరీక్షను ఎదుర్కోలేదు. గాయంతో న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో గాయంతో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక కాలేదు.
ఫిట్నెస్ను నిరూపించుకుని టెస్టు సిరీస్ కోసం ఇప్పుడు జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారిలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి హిట్‌మ్యాన్‌కు స్థానం కల్పిస్తారనే వాదనలు వస్తున్నాయి. అంతేగాక ఆటకు చాలా రోజులు దూరమైన అతడు ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తాడని అంటున్నారు.