Ind Vs Aus: వారెవ్వా జడేజా.. అందుకైనా నువ్వు జట్టులో ఉండాల్సిందే..!

Jadeja Stunning Catch (Photo : Twitter)

Ind Vs Aus: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన జడేజా మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు ద్వారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫీల్డింగ్‌ నైపుణ్యం ప్రదర్శిస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.

  • Share this:
    టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన జడేజా మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు ద్వారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫీల్డింగ్‌ నైపుణ్యం ప్రదర్శిస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌ భారీ షాట్‌ ఆడాడు.మిడాన్‌లో ఉన్న జడేజా క్యాచ్‌ అందుకోవడానికి పరిగెత్తుకు రాగా.. కమ్యునికేషన్‌ గ్యాప్‌ రావడంతో మిడాఫ్‌లో ఉన్న గిల్‌ కూడా పరిగెత్తుకు వచ్చాడు. జడేజా క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతని చేయి గిల్‌ను తాకింది. దీంతో క్యాచ్‌ మిస్సవుతుందని అంతా భావించారు. కానీ జడేజా మాత్రం బంతిని వదలకుండా చేతిలోనే ఒడిసిపట్టుకోవడంతో వేడ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. క్యాచ్‌ మిస్‌ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు. అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

    ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న ‘బాక్సింగ్‌ డే’ రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపారు. ‘బాక్సింగ్‌ డే’ రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్లు రెచ్చిపోవడంతో ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా స్కోరు 200 పరుగులు దాటలేదు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. లబుషేన్ చేసిన 48 పరుగులే అత్యధిక స్కోరు.


    ఇక, బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆసీస్ 1-0తో టెస్ట్ సిరీస్‌లో అధిక్యంలో ఉంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోతుంది. మరోవైపు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ 100వ టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో, భారత్‌ 28 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 27 టెస్టులు డ్రా కాగా.. ఒక టెస్టు టై గా ముగిసింది.
    Published by:Sridhar Reddy
    First published: