Ind vs Aus : నోరు పారేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్..అదే రేంజ్ లో అశ్విన్ వార్నింగ్.. వైరల్ వీడియో

Ind vs Aus (Photo : Twitter)

Ind vs Aus : 407 పరుగుల భారీ లక్ష్యం విధించిన ఆసీస్.. చివరి రోజు తమ పని సులవు అవుతుందని భావించింది. కానీ అలా జరగకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. భారత ఆటగాళ్లపై పదే పదే నోరు పారేసుకున్నారు.

  • Share this:
    సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్‌ని భారత్ డ్రాగా ముగించింది. చివరి రోజు ఆటలో అద్భుతంగా పోరాడి బోర్డర్ గవాస్కర్ సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. అసలైన టెస్ట్ ఇన్నింగ్స్ అంటే ఏంటో ఆస్ట్రేలియన్లకు చూపించారు మన బ్యాట్స్ మెన్. ఇక 407 పరుగుల భారీ లక్ష్యం విధించిన ఆసీస్.. చివరి రోజు తమ పని సులవు అవుతుందని భావించింది. కానీ అలా జరగకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. భారత ఆటగాళ్లపై పదే పదే నోరు పారేసుకున్నారు.ముఖ్యంగా కెప్టెన్ టిమ్ పైన్ అయితే పదే పదే స్లెడ్జింగ్ కు దిగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా అశ్విన్- విహారీ బ్యాటింగ్‌కు విసిగిపోయాడు. వారిద్దరి వికెట్ ఎలా తీయాలో తెలియక .. నోరు పారేసుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌ను గాయపరచడమే లక్ష్యంగా పెట్టుకుని బౌలర్లు బంతులు విసరగా... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ సెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో "గబ్బా టెస్టులో నీ వికెట్‌ తీయడానికి ఎదురుచూస్తున్నా... అశ్విన్" అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్.

    టిమ్ పైన్ కి కూడా తనదైన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చాడు అశ్విన్. "నువ్వు ఇండియాకి వస్తావు గా... అది నీకు ఆఖరి సిరీస్ అవుతుందనుకుంటా" అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే టిమ్ పైన్, విహారి ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేయడం విశేషం. టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు రెచ్చిపోతోంది. నిన్న రేసిజం కామెంట్లతో సిరాజ్ ను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అవమానిస్తే.. ఆఖరి రోజు ఆసీస్ ఆటగాళ్లు తమ నోళ్లకు పని చెప్పారు.


    ఇక చివరి రోజు ఆటలో అద్భుతంగా పోరాడి బోర్డర్ గవాస్కర్ సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్( 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97), పుజారా(205 బంతుల్లో 12 ఫోర్లతో 77) సూపర్ బ్యాటింగ్‌కు తోడు హనుమ విహారీ(161 బంతుల్లో 23 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్) అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్‌తో రాణించడం భారత్ ఓటమిని తప్పించుకుంది.
    Published by:Sridhar Reddy
    First published: