• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • IND VS AUS QUESTION MARKS IN BRISBANE TEST TEAM INDIA REFUSE TO ACCEPT STRICT QUARANTINE PROTOCOLS SRD

Ind vs Aus : బ్రిస్బేన్ టెస్ట్‌పై నీలినీడలు..క్వారంటైన్ రూల్స్ కు ఒప్పుకోని టీమిండియా

Ind vs Aus :  బ్రిస్బేన్ టెస్ట్‌పై నీలినీడలు..క్వారంటైన్ రూల్స్ కు ఒప్పుకోని టీమిండియా

india team

Ind vs Aus : భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ లో జనవరి 15 నుంచి జరగాల్సిన ఆఖరి టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయ్. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది. ఈ నిబంధనల ప్రకారం..

  • Share this:
    భారత్ - ఆస్ట్రేలియా సిరీస్ లో జనవరి 15 నుంచి జరగాల్సిన ఆఖరి టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయ్. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. సరిహద్దులన్నిటిని మూసివేసింది. ఈ నిబంధనల ప్రకారం మరోసారి టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను క్రికెట్ ఆస్ట్రేలియా, టీమిండియా ముందుంచింది. అయితే, టీమిండియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వారంటైన్ ఉండలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్నామని.. మరోసారి ఐసోలేషన్ అంటే కష్టమేనని బీసీసీఐ అధికారి తెలిపారు.

    ‘బ్రిస్బెన్ వెళ్లి అక్కడ మళ్లీ బయో బబుల్‌లో ఉండటానికి టీమిండియా ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే దుబాయ్‌లో 14 రోజుల క్వారంటైన్ ఉన్నాం. ఆ తర్వాత సిడ్నీలో మరో 14 రోజులు స్వీయ నిర్భంధంలోనే ఉన్నాం. దాదాపు నెలరోజుల పాటు హోటల్ గదిలోనే ఉండిపోయాం. మళ్లీ ఇప్పుడు క్వారంటైన్‌లో ఉండాలంటే మా వల్ల కాదు. అది టూర్ ముగిసే సమయంలో ఏమాత్రం భావ్యం కాదు'అని సదరు అధికారి స్పష్టం చేశాడు.


    మరోసారి క్వారంటైన్‌లో ఉండటానికి భారత జట్టు ఇష్టపడకపోవడంతో రూల్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కోరనుంది. ఒక వేళ ఇది సాధ్యం కాకపోతే.. నాలుగో టెస్ట్ ను కూడా సిడ్నీ వేదికగానే నిర్వహించాలన్న ప్లాన్ లో ఉంది. ‘ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా రాష్ట్రాల కఠిన నిబంధనల నేపథ్యంలో సుమారు 6 నెలల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇది ఏ ఒక్కరికి అంత సులువు కాదు. ఇక ఈ సుదీర్ఘ పర్యటనలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. మరోసారి ఆటగాళ్లందరిని కఠిన బయో‌ బబుల్‌లోకి పంపించాలనుకోవడం లేదు. బ్రిస్బేన్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకుంటే సిడ్నీ వేదికగానే నాలుగో టెస్ట్‌ను నిర్వహిస్తాం.'అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి తెలిపారు.

    మరోవైపు టీమిండియా క్రికెటర్లపై అభిమానంతో ఓ ఫ్యాన్ చేసిన పిచ్చి పని కొత్త చిక్కులు తెచ్చింది. భారత జట్టు టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూ ఇయర్ రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్‌ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్, పేసర్‌ నవదీప్‌ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్‌ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది.
    Published by:Sridhar Reddy
    First published: