Ind vs Aus 2020 : ఫస్ట్ డే ముగిసిన ఆట.. భారత్ స్కోరు ఎంతంటే..

India vs Australia

Ind vs Aus 2020 : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్ల జోరు, టీమిండియా బ్యాట్సెమెన్ పోరాటంతో ఫస్ట్ డే ఆసక్తికరంగా సాగింది. కానీ ఆఖరి సెషన్ లో కోహ్లీ, రహనే, విహారి వికెట్లు వరుసగా పడటంతో ఆస్ట్రేలియా టీమ్ దే కాస్త పై చేయిగా కన్పిస్తోంది.

 • Share this:
  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్‌ చేజార్చుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో విఫలమైన ఓపెనర్‌ పృథ్వీషా (0) మిచెల్‌ స్టార్క్‌ విసిరిన ఇన్నింగ్స్‌ రెండో బంతికే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రెండు బౌండరీలు బాదిన మయాంక్‌ అగర్వాల్‌ (17; 40 బంతుల్లో 2×4) సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. జట్టు స్కోరు 32 వద్ద కమిన్స్‌ వేసిన 18.1వ బంతికి వికెట్‌ చేజార్చుకున్నాడు. అయితే పుజారాతో కలిసి రెండో వికెట్‌కు అతడు 32 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసిన నయా వాల్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపాడు. టెస్ట్ బ్యాటింగ్ ఎంటో చూపించాడు. బంతి ఏదైనా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆడాడు. విరాట్‌తో కలిసి పుజారా మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో 49.3 ఓవర్ల (300 బంతులు)కు టీమ్‌ఇండియా 100/2 పరుగులు చేసింది. అయితే లైయన్‌ వేసిన ఆ తర్వాతి బంతికే అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ ఔటివ్వకపోవడంతో ఆసీస్‌ రివ్యూకు వెళ్లి సక్సెస్ అయింది. అజింక్య రహానె రావడంతో 107/3 వద్ద టీమిండియా టీ విరామానికి వెళ్లింది.

  తొలి రెండు సెషన్లలో ఆచితూచి ఆడిన టీమిండియా మూడో సెషన్లో గేర్లు మార్చింది. బంతి పాతబడటంతో కోహ్లీ, రహానె సొగసైన బౌండరీలు బాదేశారు. చక్కని బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతులకు పరుగులు రాబట్టారు. అదే జోరులో 123 బంతుల్లో కోహ్లీ మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అతడికి తోడుగా జింక్స్‌ సైతం ఓ చక్కని సిక్సర్‌తో అలరించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 168 బంతుల్లో 88 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించి జట్టు స్కోరును 150 దాటించారు. ఇక స్కోరుబోర్డు పరుగులు పెడుతుందని భావించగా జట్టు స్కోరు 188 వద్ద కోహ్లీ రనౌట్‌ అయ్యాడు. రహానె అనవసర పరుగుకు ప్రయత్నించడంతో శతకం వైపు పయనిస్తున్న కెప్టెన్‌ కోహ్లీ పెవిలియన్‌ చేరాడు.

  Ind vs Aus , India vs Australia 2020, adelaide test, first test, adelaide test news, Pink ball, pink test, virat kohli, kohli records, kohli new, kohli updates, కోహ్లీ రికార్డులు, కోహ్లీ న్యూస్, అడిలైడ్ టెస్ట్
  Virat Kohli


  188/3తో పటిష్ఠంగా కనిపించిన టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలినట్టు అనిపించింది. ఆ కొద్ది సేపటికే అర్ధశతకానికి చేరువైన రహానె సైతం జట్టుస్కోరు 196 వద్ద స్టార్క్‌ విసిరిన బంతికి ఎల్బీ అయ్యాడు. ఆదుకుంటాడని అనుకున్న హనుమ విహారి (16; 25 బంతుల్లో 2×4)ని హేజిల్ వుడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పుడు స్కోరు 206. ఆ తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్ ‌(15; 17 బంతుల్లో 1×4), వృద్ధిమాన్‌ సాహా (9; 25 బంతుల్లో 1×4) వికెట్‌ పోకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లతో 233 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, హేజిల్ వుడ్, కమిన్స్, లైయన్ తలో వికెట్ తీశారు.
  Published by:Sridhar Reddy
  First published: